కెరీర్ నాశనం అవ్వడానికి ఆయనే కారణం..? బయట పెట్టిన ఛార్మి?

0
571

టాలీవుడ్ లో అడుగు పెట్టిన అనతి కాలంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది చార్మి. బుట్ట బొమ్మగా ఆమెను బాపు రమణ తన సినిమాలో ఎంపిక చేసుకున్నాడు. అంటే ఆమె ఎంతటి అదృష్ట వంతురాలై ఉంటుంది. ఇమె ఇండస్ర్టీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో నటించి నటనలో వారి మెప్పులు సైతం అందుకుంది. నాగార్జున ఒక సందర్భంలో చార్మి నాకు స్పెషల్ అని కామెంట్ చేశాడంటే ఆమె నటనకు ఆయన ఏ లెవల్ లో ఫిదా అయిపోయి ఉంటాడో అర్థమవుతుంది.

దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి

చార్మి చాలా డెడికేషన్ ఉన్న యాక్టరంట. ఆమె టైంకి షూటింగ్ కు వచ్చి షెడ్యూల్ ప్రకారం ఫినిష్ చేసుకుని వెళ్తుందట. ఛార్మి తన పనిని డెడికేషన్ గా పూర్తి చేస్తుందట. టైంకి షూటింగ్ కు వచ్చి డైరెక్టర్ తో షాట్ గురించి చర్చించి చేసేదట. ఇక బోల్డ్, రొమాన్స్ సీన్లకైతే పాత్రను బట్టి నో చెప్పదని చెప్తుంటారు. దీంతో టాలీవుడ్ తో పాటు కోలివుడ్ ఇండస్ర్టీలో సైతం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పుకునే ఒక డైరెక్టర్ ఆమెను ఐటం సాంగ్ చేయన్నాడట.

ఐటం గర్ల్ గానే చూసేందుకు

 

కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఆయన సలహా పాటించి ఆమె కూడా సరే అని చెప్పిందట. ఆ తర్వాతి పరిణామాలు ఆమె కెరీర్ పరంగా పూర్తిగా మారిపోయాయి. ఫస్ట్ ఐటం సాంగ్ చూసిన దర్శక, నిర్మాతలు ఆమె అందులో బాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి హీరోయిన్ ఛాన్స్ లకు బదులు ఐటం సాంగ్స్ కే బుక్ చేసుకునేవారట. కాలం గడుస్తున్నా కొద్దీ ఆమెను ఐటం గర్ల్ గానే చూసేందుకు ప్రేక్షకులు సైతం ఇష్టం చూపేవారు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోయినట్లయింది.

ఆ డైరెక్టర్ మాట విని

ఆ డైరెక్టర్ మాట వినకుండా అదే ఊపులో సినిమాలు తీసుంటే ఆమె ఇప్పుడు ఇండస్ర్టీలో మచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మిగిలేది. కానీ ఒక్క ఐటం సాంగ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పుకచ్చింది ఛార్మి. ఒకరి చెడు కోరితే అది వారిని కూడా కుదుపుతుందని పెద్దలు చెప్పినట్లు ఛార్మీకి ఆ సలహా ఇచ్చిన డైరెక్టర్ కు కూడా ఇప్పుడు తెరమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయట.

లైగర్ సైతం డిజాస్టర్

చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు అంటుంది ఛార్మీ. ఇటీవల ఛార్మీ ప్రొడ్యూసర్ గా మారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా తీసింది. అది డిజస్టర్ గా మిగిలింది. దీంతో ఆమె మరింత డీప్రెషన్ లోకి వెళ్లింది. దీనికి తోడు చిత్ర నిర్మాణంలో పెట్టుబడులపై ఈడీ సైతం ప్రశ్నిస్తుండడంతో ఛార్మీ ఇప్పుడు మింగలేక కక్కలేక అనే పరిస్థితిలో కూరుకుపోయింది. ఏది ఏమైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ మంచి అవకాశాలతో దూసుకుపోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.