బేబమ్మకు ఘోర అవమానం.. మండిపడ్డ కృతి శెట్టి

0
993

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ ఇవ్వడం చాలా అరుదనే చెప్పాలి. ఆ ఛాన్స్ ను తన ఖాతాలో వేసుకుంది కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’లో నటించిన కృతి శెట్టి తన నటనతో అందరినీ ఆకర్షించింది. తొలి సినిమాలోనే ఆమె నటనను చూసి విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వెంట వెంటనే వచ్చిన ‘శామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ కూడా మంచి టాక్ దక్కించుకోవడంతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు

ఇక మొదట్లో కృతి శెట్టిది గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీ భావించింది. వరుస బెట్టి వస్తున్న చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లింది. అందులో ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వరుసగా ఫ్లాపులను ఎదుర్కొన్నాయి. దీంతో పాతాళంలోకి వెళ్లిన కృతి శెట్టి ఈ సారి ఆచి.. తూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున కొడుకు నాగ చైతన్యతో కలిసి ‘కస్టడీ’ చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ ప్రభు. వచ్చే ఏడాది ఇది తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కోబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు తమిళ్, మళయాలం భాషల్లో కూడా కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కృతి శెట్టి.

బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు

వీటితో పాటు ఈ అమ్మడికి ఇటీవల బాలీవుడ్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందట. ‘అంధాదున్’ సినిమా తీసిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ చేస్తున్న తన తర్వాతి ప్రాజెక్టులోకి కృతి శెట్టిని తీసుకోవాలని అనుకున్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవల కథను కూడా ఆమెకు వినిపించాడు రాఘవన్. స్టార్ డైరెక్టర్ కావడం, పైగా బాలీవుడ్ లోకి ఎంట్రీ నేపథ్యంలో ఆమె కూడా ఈ ప్రాజెక్టులో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. అంతా ఒకే అనుకునే నేపథ్యంలో ఒక ఘటన జరిగింది.

ఆడిషన్ కు రావాలంటూ అవమానం

బాలీవుడ్ లో శ్రీరామ్ రాఘవన్ సినిమాకు ఎంపిక చేసిన కృతి శెట్టిని డైరెక్టుగా షూటింగ్ కు పిలవకుండా ఆడిషన్ కు రమ్మన్నారట. దీంతో ఆమె బాగా హర్ట్ అయ్యిందట. కొత్త హీరోయిన్లకు ఇది కామనే.. కానీ రెండు, మూడు సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్.. దాదాపు ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటించిన తననే ఆడియన్స్ కు రమ్మంటారా అంటూ తీవ్రంగా హర్ట్ అయ్యిందట. రాఘవన్ తనను సినిమాకు ఎంపిక చేసిన విషయంలో ఆడిషన్ గురించి ఎక్కడా చెప్పలేదని, ఇది తనకు తీవ్రమైన అవమానమని చెప్పుకచ్చిందట.

ఆడిషన్ కు రానని తెగేసి చెప్పిన అమ్మడు. చిత్రాన్ని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ అవకాశాన్ని వదులుకోవద్దని ఆమె ఫ్యాన్స్ సూచిస్తున్నా.. అవేవీ పట్టించుకోవడం లేదు. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.