ఆ బంధం కలిసిరాని టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్

0
402

ప్రేమ అనేది ఎవరి మనసులో ఎప్పుడు కలుగుతుందో.. ఎప్పుడు పోతుందో చెప్పలేం. ఇందులో కొందరు పెద్దలను ఎదిరించి పెళ్లిళ్లు చేసుకుంటే.. ఇంకొందరు ఇంటి నుంచి వెళ్లిపోయిన నచ్చన వారితో ఆనందంగా గడుపుతున్నారు. ఇందులో మరికొందరు ఒకరు, లేదా ఇద్దరితో ప్రేమలో పడుతున్నారు. లేదా మధ్యలోనే బ్రేకప్ చెప్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. డేటింగ్ ల వరకూ వెళ్లిన సదరు జంట లవ్ మధ్యలోనే ఎందుకు విఫలమైందన్న అనుమానాలు లేకపోలేదు. ఇవన్నీ సాధారణ వ్యక్తుల జీవితంలో అయితే ప్రత్యేకంగా చర్చ ఉండదు. కానీ ఇవన్నీ సెలబ్రెటీల మధ్య అయితే ఇంకే ముంది రచ్చకెక్కడం ఖాయం.

ఈ కోవలోనే వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోయిన్లు ప్రేమలో పడడం, వారిని విడిచిపెట్టి మరో వ్యక్తితో మరో సారి ప్రేమలో పడడం, వారిని కూడా విడిచిపెట్టి చివరికి ఎవరినో వివాహం చేసుకోవడం. ఇలా ప్రేమ మైకంలో ఎంతో మంది హీరోయిన్లు వారి జీవితాలను కోల్పోయారు. కొందరు కెరీర్ ను పూర్తిగా నాశనం చేసుకోగా.. మరికొందరు తేరుకొని మళ్లీ పుంజుకుంటున్నారు. ఇలా పుంజుకున్న స్టార్ హీరోయిన్స్ గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నయనతార

నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ మొదట్లో శింబుతో ప్రేమాయణం సాగించింది. తర్వాత కారణం ఏదైనా సరే విడిపోయింది. తర్వాత కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవాతో ప్రమలో పడింది. అప్పటికే ప్రభుదేవాకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి దాదాపు పెళ్లి పీటల వరకూ వెళ్లారు. కానీ అది ఆగిపోయింది. తర్వాత తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసి చివరికి పెళ్లి చేసుకుంది. ఇటీవల సరోగసి పద్ధతిలో ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా మారింది.

సమంత

ఇటీవల పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గతంలో హీరో సిద్ధార్థతో ప్రేమలో పడింది. కొంత కాలానికి వీరు విడిపోయారు. తర్వాత ‘ఏ మాయ చేశావే’ సినిమా సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. వీరికి పెళ్లి జరిగింది. కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వీరు ఇటీవల విడిపోయారు.

రష్మికా మందన

కన్నడ నటి రష్మికా మందనకు నేషనల్ క్రష్ గా గుర్తింపు ఉంది. అప్పట్లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి కొన్ని రోజులు ప్రేమాయణం నడిపింది. వీరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ తన కెరీర్ మొదట్లో ఉందని ఇప్పుడే పెళ్లి చేసుకుంటే వెనుకబడి పోతానని అనుకుంది కాబోలు పెళ్లి పీటలు ఎక్కకుండానే వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది.

త్రిష

టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష కూడా కెరీర్ మొదట్లో హీరో శింబుతో ప్రేమలో పడింది. కొన్ని రోజుల తర్వాత వీరు విడిపోయారు. ఆ తర్వాత ఓ ఫేమస్ తమిళ్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో వీరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. వీరి మధ్య ఏమైందో కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

శృతీ హాసన్

విశ్వ నటుడి డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతీ హాసన్. మొదట్లో కెరీర్ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ‘కాటమరాయుడు’ నుంచి పుంజుకుంది. అయితే ఈ భామ హీరో సిద్ధార్థతో కొన్ని రోజులు ప్రమాయణం నడిపింది. దాన్ని బ్రేకప్ చేసుకున్న తర్వాత మరో నటుడితో మళ్లీ ప్రేమలో పడింది. అతడికి కూడా బ్రేకప్ చెప్పి శంతను హజారికాతో ప్రస్తుతం ప్రేమలో ఉంది. ఇతడినైనా వివాహం చేసుకుంటుందా చూడాలి మరి.

మెహరిన్ కౌర్

మెహరిన్ కౌర్ వివాహం కూడా పీటల వరకూ వచ్చి ఆగిపోయింది. ప్రముఖ రాజకీయ నాయకుడి మనుమడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమాయణం నడిపిన మెహరిన్ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కానీ ఇటీవల పెళ్లిని రద్దు చేసుకుందని తెలిసింది.

ఇలా టాలీవుడ్ భామలకు ప్రేమలు కలిసి రావడం లేదు. ఒకరు ఇద్దరితో ప్రేమాయణం సాగించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వాటిని పక్కకు నెట్టి మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టి రాణిస్తున్నారు.