వర్మ వ్యూహం మళ్లీ బెడిసికొట్టింది

0
406
Vermas strategy backfired

ఎదుటి వారి మీద బురద జల్లడం.. ఆనక దాన్ని చూసి ఆనందించడం వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. నేషనల్‌ టాలెంటెడ్‌గా పేరు వచ్చినప్పటికీ..

ఎందుకో అనవసర వివాదాల్లోకి దూరడం అలవాటుగా పెట్టుకుని ఆ వచ్చిన పేరును పోగొట్టుకున్నాడు వర్మ. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఆర్జీవి.

ఆ పార్టీకి సానుకూలంగా.. అదే సమయంలో వైసీపీ రాజకీయ శత్రువు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సినిమాలు రూపొందించడమే పనిగా పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమా నిర్మించాడు. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ ఈ సినిమాను నిర్మించారు.

అనేక వివాదాస్పద అంశాలతో నిండిన ఈ చిత్రంపై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీ కూడా కోర్టుకు వెళ్లాయి. ఈ సినిమా వివాదాస్పదంగా ఉండటంతో తెలుగు సెన్సార్‌బోర్డ్‌ వారు సెన్సార్‌ను నిరాకరించారు.

దీంతో బయట రాష్ట్రంలో దీన్ని సెన్సార్‌ చేయించాడు వర్మ. అనంతరం డిసెంబర్‌లోనే విడుదలకు డేట్‌ కూడా ఇచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..

సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని నారా లోకేష్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ జరిపిన కోర్టు శుక్రవారం లేదా సంక్రాంతి శెలవుల అనంతరం తీర్పును వెలవరిస్తామని చెప్పింది.

It is because of that name that we were able to do the movie Devara Kalyan Ram

ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలను ఈ సినిమా ప్రభావితం చేస్తుందని కోర్టు కనుక భావిస్తే.. తెలంగాణలో అయినా సినిమాను విడుదల చేయాలని వర్మ ప్లాన్‌ వేశాడు.

ఇదే విషయాన్ని తన లాయర్‌ ద్వారా కోర్టుకు తెలియజేశారు. అయితే తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోక పోవడంతో వర్మ వ్యూహం బెడిసి కొట్టినట్టు అయింది.

మరోవైపు ఈ చిత్ర నిర్మాత కిరణ్‌ సైతం అనవసరమైన వివాదాన్ని నెత్తినపెట్టుకున్నామే అని ఇప్పుడు ఫీలవుతున్నారు. నిన్న ఫిలింఛాంబర్‌లో ఓ మిత్రుడితో మాట్లాడుతూ..

అనవసరంగా వర్మ తోక పట్టుకుని నడిచాను బాసూ.. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అక్కడ అంత అనుకూలంగా లేదు.

రేపు ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి కనుక గెలిస్తే.. నా పరిస్థితే ఇబ్బందిగా మారుతుంది. వర్మకేం అతను బాగానే ఉంటాడు అంటూ బాధ పడ్డాడు.