సరిగ్గా ఏడాదికి ‘టిల్లు స్క్వేర్’.. వేగంగా షూటింగ్

0
291

‘సితార ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై జొన్నలగడ్డ సిద్ధు హీరోగా చేసిన సినిమా ‘డీజే టిల్లు’. ఇది ఫిబ్రవరి2022 లో విడుదలై కామెడీ చిత్రంగా బాక్సాఫీస్ హిట్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ‘సితార ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుందని ప్రకటించారు. ఆ తర్వాత విడుదలైన ఈ మూవీ సంచలనాలు సృష్టించింది. నాగవంశీ చెప్పినట్లుగానే దీని సీక్వెల్ కు సంబంధించి హీరో సిద్ధు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సిద్ధు ట్వీట్

‘డీజీ టిల్లు’ సినిమాలో సిద్ధూ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. డీజే టిల్లు సీక్వెల్ షూటింగ్ పై సిద్ధూ అప్ డేట్ ఇస్తూ ఫీల్ ఫ్రెష్ గా, న్యూ ఎంటర్ టైన్ మెంట్ కలబోతగా చిత్రం వస్తుందని ట్వీట్ చేశారు సిద్ధూ. సెట్స్ పై దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీని కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం అంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

‘టిల్లు స్క్వేర్’ గా

డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిట్ ఖారారు చేసింది చిత్ర యూనిట్. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమా’తో కలిసి ‘సితార ఎంటర్ టైన్ మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఇండస్ర్టీ చెప్తుంది. అయితే ఈ మూవీ ప్రస్తుతం షెట్స్ పై ఉందని వచ్చే దీపావళి నాటికి (24 అక్టోబర్ 2023)కి విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే అఫీషియల్ గా కూడా ప్రకటించింది. ఇందులో సిద్ధూ సరసన అనుపమా పరమేశ్వర్ నటిస్తున్నారట. మల్లిక్ రాం డైరెక్షన్ చేస్తున్నారు.

ఏడాదికే సీక్వెల్ రిలీజ్

‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇది విడుదలైన ఏడాదికే సీక్వెల్ మూవీ అయిన ‘టిల్లు స్క్వేర్’ సందడి చేయనుండడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. డీజే టిల్లులో టైటిల్ సాంగ్ స్వరపర్చిన మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల ఈ సీక్వెల్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటో గ్రాఫర్ గా సాయి ప్రకాశ్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాశ్ వ్యవహరిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’ కూడా డీజే టిల్లును బీట్ చేసి మరింత వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా చెప్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ కూడా త్వరలో ఇస్తామని చిత్ర యూనిట్ చెప్తుంది. ఈ మూవీలో టిల్లు హవా ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.