నరేష్ భార్యకు షాక్ ఇచ్చిన పవిత్ర లోకేష్

0
547

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ఈ ఇద్దరు నటుల చుట్టే గాసిప్ లు, సినీ ఇండస్ర్టీ చక్కర్లు కొడుతుంది. ఇటీవల పవిత్రా లోకేశ్ తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టింది. అభ్యంతర కర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకువాలని సైబరాబాద్ పోలీసులను కోరింది. ఇందులో భాగంగానే నరేశ్ మూడో భార్యపై కేసు పెట్టినట్లు తెలస్తోంది.

నటన కంటే వివాదాల్లోనే

సినియర్ నటుడు, పవిత్రా లోకేశ్ ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల్లో నటన గురించి కంటే వారి పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ సంపాదించుకుంటున్నారు. నరేశ్, పవిత్రా మైసూర్ లోని ఓ హోటల్ లో ఉండగా నరేశ్ సతీమణి రమ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంలో గాసిప్ లు మొదలయ్యాయి. సహజీవనం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై వారిద్దరూ మీడియా ముందు స్పందించారు. దీంతో ఇప్పుడంతా ఓపెన్ సీక్రెట్ గా మారింది.

తాజాగా సైబర్ పోలీసులుక ఫిర్యాదు

తనను అభ్యంతకర పోస్టులతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ పవిత్రా లోకేశ్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య రమ్యపై కూడా ఫిర్యాదు చేశారంట. వారిద్దరి మధ్య ఉన్న వివాదాలు బయటకు పొక్కకుండా నరేశ్ భార్య తనను మధ్యలోకి లాగుతూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారట. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని వాదనలకు దిగుతూ కించపరుస్తున్నట్లు వెల్లడించింది.

పవిత్రను నరేశ్ పెళ్లి చేసుకుంటారా

తాను నరేశ్ కో ఆర్టిస్టులమని మేము చిత్రాల్లో నటించిన భాగాలను తీసుకొని మార్ఫింగ్ చేసి కొన్ని ఛానళ్లు, వెబ్ సైట్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకచ్చారు. నరేశ్, పవిత్రపై వచ్చిన వీడియో, గాసిప్స్ పై గతంలో స్పందించారు నరేశ్, పవిత్ర. మీమిద్దరం కలిసే ఉంటున్నామని, కానీ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదని చెప్పారు. తమను సపోర్ట్ చేయాలని ఫ్యాన్స్ ను కూడా కోరారు. పవిత్ర చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తూ వస్తున్నారని నరేశ్ అనగా, నరేశ్ గురించి మీ అందరికీ బాగా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు పవిత్ర.

నరేశ్ ఇప్పటికే మూడు వివాహాలు

నరేశ్ భార్య అని రమ్య తామిద్దరిపై ఆరోపణలు చేస్తుందని పవిత్ర గతంలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. రీసెంట్ గా సూపర్ స్టార్ క్రిష్ణ మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని కూడా నరేశ్ తో కలిసి పవిత్ర సందర్శించి నివాళులర్పించారు. అంత్య క్రియల్లో కూడా పవిత్ర లోకేశ్ పాల్గొన్నారు. అయితే నరేశ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నాడు. పవిత్రను కూడా పెళ్లి చేసుకుంటారా అంటూ గాసిప్స్ ఇప్పుడు ఇండస్ర్టీని కుదిపేస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు వీరు బాగా ట్రెండింగ్ ఉన్నారంటూ చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.