‘మసూద’ రివ్యూ @ రేటింగ్

0
4512

యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో సాగే చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో హర్రర్ థ్రిల్లర్ కు క్రేజ్ ఎక్కువనే చెప్పాలి. అదే కోవలో నవంబర్ 18న విడుదలైంది ‘మసూద’. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటించింది. తిరువీర్, కవ్యా కళ్యాన్ రాం హీరో, హీరోయిన్లుగా నటించారు. న్యూ యంగ్ డైరెక్టర్ సాయి కిరణ్ ఈ చిత్రంతో పరిచయం అయ్యాడు. ఈ మూవీ రివ్యూను ఇక్కడ చూద్దాం..

కథ

సంగీత (నీలం సినిమాలో క్యారెక్టర్ పేరు) ఓ సైన్స్ టీచర్. తన భర్త సత్యప్రకాశ్ (అబ్దుల్)తో విడాకులు తీసుకొని కూతురు బాంధవి శ్రీధర్ (నాజియా)తో ఒక ఇంట్లో రెంట్ కు ఉంటుంది. తన పక్క ఫ్లాట్ లో ఉండే తిరువీర్ (గోపీ) వీరికి సాయంగా ఉంటాడు. గోపీ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నా చాలా భయస్తుడు. తన పక్క ఫ్లాట్ లో ఉంటున్న నీలం కూతురు నాజియా దయ్యం పట్టినట్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె చేష్టలతో భయాందోళనకు గురవుతున్న గోపీ ఓ పీర్ బాబా (శుభలేక సుధాకర్)ను ఆశ్రయిస్తాడు. తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి..? ఎలా మలుపు తిరుగుతోంది.. ఇందులో మసూద ఎవరు..? చివరికి కథ ఎలా ముగుస్తుంది సినిమాలో చూడాలి.

టెక్నికల్ వింగ్

సాధారణ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించవచ్చు. కానీ హర్రర్ థ్రిల్లర్ లో అది సాధ్యం కాదు. స్ర్టాటింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒకే టెంపోలో వెళ్లాలి. లేదంటే ప్రేక్షకులకు భయం పోతుంది. ఈ చిత్రం విషయంలో డైరెక్టర్ సాయి కిరణ్ మంచి టెంపో కొనసాగించాడు. చివరి వరకు భయాన్ని కంటిన్యూ చేస్తూనే వెళ్లాడు. మధ్యలో కొంచెం లవ్ ట్రాక్ తీసుకచ్చినా కథను అది డిస్ర్టబ్ చేయలేదు. కొత్త దర్శకుడే అయినా మూవీ ప్రజెంటేషన్, కనెక్టివిటీలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ ముందు వసూద ఎవరనే రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సాగతీత లేకుండా కన్ క్ల్యూజన్ చేశాడు. కెమెరామన్ నగేష్ బానెల్ ప్రతీ దృశ్యాన్ని తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. హర్రర్ సీన్స్, నైట్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది.

పర్ఫార్మెన్స్

సగటు తల్లి పాత్రకు సంగీత సరిపోయింత న్యాయం చేయగా, కూతురు పాత్రలో బాంధవి శ్రీధర్ భయపెట్టి మెప్పించింది. తిరువీర్ నటన కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ కావ్య కళ్యాన్ రాంకు స్కోప్ ఉన్న పాత్ర కాకపోవడంతో ఉన్నంతలో మెప్పించిందనే చెప్పొచ్చు. శుభలేక సుధాకర్ పీర్ బాబా పాత్రలో బాగా నటించాడు. ఇంకా క్రూ అంతా ఆశించినంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హర్రర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

డైరెక్టర్: సాయి కిరణ్
నిర్మాత: నక్క రాహుల్ యాదవ్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: జస్విన్ ప్రభు
సినిమటో గ్రఫీ: నగేశ్ బానెల్

నటీ, నటులు: సంగీత, తిరు వీర్, కావ్యా కల్యాన్ రాం, బాంధవి శ్రీధర్, శుభలేక సుధాకర్, తదితరులు

ప్లస్ లు: స్టోరీ, స్ర్కీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, టేకింగ్
మైనస్ లు: ఎడిటింగ్, క్లైమాక్స్ లో లాగు, లవ్ ట్రాక్