‘అన్ స్టాపబుల్’ ప్రోమోకు గ్రేట్ వ్యూవ్స్..!

0
1374

నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ న్యూ సీజన్ వినూత్నంగా ఆకట్టుకుంటుంది. గ్రేట్ సెలబ్రిటీలను ఎంపిక చేసుకొని మరీ ఎంటర్ టైన్ చేస్తున్నారు బాలయ్య. దీంతో నెక్స్ట్ ఎపిసోడ్ పై ప్రేక్షకులకు క్యూరియాసిటీ ఏర్పడుతుంది. వరుసగా మూడు ఎపిసోడ్స్ వీక్షించిన ఆడియన్స్ నాలుగోదాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎవరనేది ప్రోమో ఇప్పటికే రిలీజైంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 25న ఆహాలో స్ర్టీమింగ్ కానుంది.

పొలిటీషియన్ల నుంచి సైతం నవ్వులు

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ సీజన్ 2లో నాలుగో ఎపిసోడ్ 25 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, సినియర్ హీరోయిన్ రాధిక అలరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను గురువారం సాయంత్రం ఆహా విడుదల చేసింది. ప్రతి ఎపిసోడ్ లో న్యూ ఎనర్జీని కనబరుస్తున్నారు బాలయ్య. ఎప్పటికీ సీరియస్ గా పొలిటీషియన్ల నుంచి సైతం నవ్వులు పూయిస్తున్నారు యువరత్న. గతంలో చంద్రబాబు నాయుడితో ‘బావా’ నవ్వులు పూయించారు. ఇక ఈ ఎపీసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డితో పొలిటికల్ తో పాటు నవ్వులు మిక్స్ చేసినట్లు ప్రోమో చూస్తే కనిపిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన విధానాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అప్పటి రాజకీయ పరిస్థితులను ఊటంకిస్తూ ఆసక్తికరంగా షో సాగుతుంది.

రాధికను ఇరుకునపెట్టి నవ్వులు

రాజకీయాల నుంచి ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లోకి వచ్చిన బాలయ్య పొలిటీషియన్లతో క్రికెట్ ఆడారు. ఎంపైర్ లేకుండా క్రికెట్ ఏంటి అంటూ నటి రాధిక ఎంట్రీ ఇచ్చారు. నేను వచ్చేదాక మీరు.. నేను వచ్చాక వన్ అండ్ ఓన్లీ రాధిక అంటూ ఆమె అన్ స్టాపబుల్ కు దమ్కీ ఇచ్చారు. ఇక నటి రాధికకు ప్రశ్నించారు. తనంటే ఎక్కువ.. అభిమానమా.. లేదా చిరంజీవి అంటేనా.. అంటూ ప్రశ్నించిన విధానం రాధికను ఇరుకునపెట్టి నవ్వులు పూయించినట్లు ప్రోమోలో తెలుస్తుంది. ఇక సందడి చేసేందుకు 25 వరకు ఆగాలంటుంది ‘ఆహా’ ప్లాట ఫాం.

రాధిక నాకు గాడ్ ఫాదర్

తర్వాత వారంతా కలిసి మాట్లాడుతూ చెన్నైలో ఉన్న సమయంలో రాధిక నాకు గాడ్ ఫాదర్ గా ఉండే వారని విషయాన్ని బాలయ్య చెప్పారు. ‘టాలీవుడ్, కోలీవుడ్, బాలివుడ్ లలో స్టార్ హీరోలతో చేసిన రాధిక’ నాలాంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ ఇంత వరకూ ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించారు. చిరంజీవిలో నచ్చనిది.. నాలో నచ్చింది.. ఏంటని..? రాధికను ఇరుకున పెట్టారు. ప్రోమో అయితే అదిరిపోయింది. ఇక ఎపిసోడ్ కోసం వెయిట్ చేయక తప్పదంటున్నారు అభిమానులు.