జపాన్ లో 430 రోజులు పూర్తి చేసుకున్న RRR

0
277
rrr collections

దర్శక ధీరుడు రాజమౌళి గత ఏడాది #RRR చిత్రం తో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు . మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ వరకు తీసుకెళ్లి ఆస్కార్ అవార్డు కూడా దక్కేలా చేసాడు.

దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడే మెగా మరియు నందమూరి ఫ్యామిల హీరోలతో మల్టీస్టార్రర్ సినిమా తియ్యడమే కాకుండా, ఆ మల్టీస్టార్ర్ర్ చిత్రాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా, చరిత్ర దాని గురించి ఎప్పుడు గర్వంగా మాట్లాడుకునేలా చేసాడు. ఈ సినిమాని మన ఇండియా లో కంటే ఇతర దేశాల్లో ఎగబడి చూస్తున్నారు.

rrr collections

రూ.10 తో పది లక్షలు కొల్లగొట్టిన బాలయ్య!

ముఖ్యంగా నార్త్ అమెరికా వంటి చోట్ల ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ గా వేస్తున్నారు. ఇక జపనీస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఆదరించారో మాటల్లో చెప్పడం కష్టం.

ఆ దేశం లో ఈ చిత్రం దాదాపుగా మూడు బిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చెయ్యడమే కాకుండా, ఏడాది నుండి గ్యాప్ లేకుండా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై దాదాపుగా 430 రోజులు అయ్యింది.

అయినా కూడా ఈ చిత్రం ఇంకా 7 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. కేవలం జపాన్ దేశం నుండే ఈ చిత్రానికి ఇండియన్ కరెన్సీ లెక్కలో 170 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద #RRR కలెక్షన్స్ ఇప్పుడు 1400 కోట్ల రూపాయలకు అతి దగ్గరగా ఉంది. ఈ చిత్రాన్ని చైనా ప్రజలు కూడా విశేషంగా ఆదరిస్తారు.

ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను అక్కడి ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి చైనా లో సాధ్యమైనంత తొందరగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే 2000 కోట్ల రూపాయిల మార్కుని భవిష్యత్తులో అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

రాజమౌళి కి గ్లోబల్ వైడ్ గా వచ్చిన ఈ క్రేజ్ ని చూస్తూ ఉంటే, ఆయన త్వరలో మహేష్ బాబు తో చెయ్యబోయే సినిమాతో ఇంకెన్ని వండర్స్ ని సృష్టిస్తాడో చూడాలి. ఈసారి టార్గెట్ హాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ అని అభిమానులు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.