ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన పవిత్ర, నరేశ్

0
1360

సీనియర్ నటుడు నరేశ్ – పవిత్రా లోకేశ్ వ్యవహారం గురించి చర్చ అవసరం లేదు. తన మూడో భార్యను కాదని నరేశ్ ఇప్పుడు పవిత్రా లోకేశ్ వెంట పడుతున్నాడు. ఇది ఇండస్ట్రీతో పాటు లోకానికి కూడా తెలిసిందే. ఈ మధ్య వారు తీసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అధరాలను ఛుంబించుకుంటూ తీసుకున్న వీడియోతో తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ చెప్పకనే చెప్తున్నారని చాలా కామెంట్లు వినిపించాయి.

దీనికితోడు నరేశ్ స్నేహితుడు చిట్టిబాబు కూడా ఈ మేరకు కొన్ని కామెంట్లు చేశాడు. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇస్తున్నాడు. కోర్టు ప్రొసీజర్ అంతా ఒకే అయ్యింది. ఇక డబ్బులు ఇవ్వడమే మిగిలింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో వీడి వాదనలకు బలం చేకూరింది.

చర్చలకు దారి తీసిన ముద్దు సీన్

డిసెంబర్ 31న నరేశ్ పవిత్ర చేసిన ఒక వీడియో ఇండస్ట్రీలో తీవ్ర చర్చలకు దారి తీసింది. పవిత్ర నరేశ్ పెళ్లి చేసుకోబోతున్నారా.. ఏ తేదీ.. ఎక్కడ..? ఇలా ప్రతీ ఒక్కరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నరేశ్ పవిత్రతోని ఈ జర్నీని ఆపుతారా మరొకరితో మళ్లీ మొదలు పెడతారా ఇలా వింత వింత కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ లిప్ లాక్ సీన్ గురించి ఒక విషయం తెలిసింది. ఇది ఒక పర్పస్ కోసం షూట్ చేశారంటా.. కానీ దీన్ని సోషల్ మీడియాలోకి మాత్రం మరో పర్పస్ లో వదిలారు.

నరేశ్-పవిత్ర అధర చుంబనం అదిరింది

ఇక నరేశ్-పవిత్రా లిప్ లాక్ గురించి తెలుసుకుంటే.. ‘మళ్లీ పెళ్లి’ అని నరేశ్ పవిత్రతో కలిసి అందరినీ పిచ్చివాళ్లను చేశారంట. అవును వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందట. ఈ సినిమాల్లో వీరు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారట. భార్య భర్తలుగా ఈ జంట అలరించబోతుందని ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లిందని తెలుస్తోంది. ఈ మూవీ కూడా వారిద్దరి జీవితంలోని వాస్త వ ఘటనల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారట. ఈ మూవీలోని సీన్ నే డిసెంబర్ 31 నైట్ చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు నరేశ్ పవిత్ర.

ప్రమోషన్ కోసమే

ప్రమోషన్ కోసమే ఇంత పని చేసినట్లు చెప్తున్నారు నరేశ్-పవిత్రా లోకేశ్. మళ్లీ పెళ్లి గాసిప్ తో వారు అనుకున్నంత మేర ప్రమోషన్ కూడా లభించిందట. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. లక్షలాది వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. దీనికి పుకార్లు కూడా తోడవడంతో ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. అనవసరమైన వివాదాన్ని కొనసాగిస్తూ నరేశ్ పవిత్ర మంచి ట్రాక్ ప్లే చేశారనీ, ‘మళ్లీ పెళ్లి’ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా వీరు ప్లే చేసిన తీరును కొందరు అసహ్యించుకుంటుండగా, మరికొందరు మాత్రం పబ్లిసిటీ ట్రిక్ బాగా పని చేసిందని కామెంట్లు చేస్తున్నారు.