మామతో ఎఫైర్ అంటగట్టి.. విడాకుల కోసం

0
1554

ఏడాది నుంచి సీనియర్ నటుడు నరేశ్-పవిత్రా లోకేశ్ గురించి ప్రతి రోజూ వింటూనే ఉన్నాం. వీరు ఒక రూమ్ లో ఉండగా నరేశ్ భార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తర్వాత కొన్ని రోజులు మామూలుగా కలుసుకొని మాట్లాడుకుంటున్నాం అంటూ తర్వాత లివింగ్ రిలేషన్ అంటూ ఇలా పలు విధాలుగా చెప్పుకచ్చారు. తమ పరువు తీస్తున్నాయని, వ్యక్తిగత విషయాలకు ఆరోపణలు జోడించి ప్రచారం చేస్తున్నారని కొన్ని వెబ్ సైట్లు, వెబ్ ఛానళ్లపై నరేశ్-పవిత్ర ఇటీవల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరి బంధానికి నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఎప్పుడూ అడ్డు చెప్తూనే ఉంది. ఇటీవల డిసెంబర్ 31 రాత్రి నరేశ్-పవిత్ర లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఇక నరేశ్ నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్తలు గుప్పు మన్నాయి. కానీ ఇదొక సినిమా కోసం చేసిందని తర్వాత తెలిసింది. ఇవన్నీ అటుంచితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నరేశ్ గురించి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

చాలా టార్చర్ పెట్టాడు

‘నరేశ్ చాలా దుర్మార్గుడు. విడాకులు ఇవ్వాలని చాలా టార్చర్ పెట్టాడు. ఆయన చేసిన అన్ని పనులకు సంబంధించి నా దగ్గర పూర్తి అవిడెన్స్ ఉన్నాయి. ఆయన ఎంతటి దుర్మార్గుడో ఒక ఉదాహరణతో మీకే తెలుస్తుంది. విడాకులు ఇవ్వనన్నందుకు మా మామగారు కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పుకోలేదు. మా మామగారు చివరి దశకు చేరుకున్నారు.

ఇలాంటివి వింటే ఆయన మరింత కుంగిపోతారు. అందుకే మా మామగారికి ఈ విషయం తెలియనివ్వలేదు. ఇప్పటి వరకూ అన్నీ ఓపికగా భరించుకుంటూ వచ్చాను. ఎవ్వరికీ ఏమీ తెలియనివ్వలేదు. ఈ విషయాలు బయటకు వెళ్తే.. మా కుటుంబం పరువే పోతుందని ఓపిక పట్టాను.

సృతి మించుతున్న నరేశ్ వ్యవహారం

నరేశ్ చేసే పనులు రోజు రోజుకూ సృతి మించిపోతున్నాయి. ఆయనకు అడ్డుకట్ట వేసేవారు ఎవ్వరూ లేరు. నాకు విడాకులు ఇచ్చి బయటకు పంపి ఇంకో అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎంత టార్చర్ అయినా భరిస్తాను కానీ నరేశ్ కు విడాకులు అస్సలు ఇవ్వను. నా కొడుకు నాన్న కావాలి అంటున్నాడు. వాడికి ఎవరు సమాధానం చెప్తారు. మాకు విడాకులు వచ్చాయి.. డబ్బుల విషయంలో ఆగుతుంది అంటూ చాలా మంది అనుకుంటున్నారు, ఇదంతా అబద్ధం. మాకు ఇంకా డైవర్స్ రాలేదు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నానని నరేశ్ నాపై ఆరోపణలు సృష్టిస్తున్నాడు. నాతో నా భర్త ఉంటే చాలు డబ్బు అవసరం లేదు.

ఫోర్జరీ సంతకంతో నరేశ్ కోర్టులో సూట్ ఫైల్ చేశాడు

నాకు చాలా ప్రాపర్టీలు ఉన్నాయి. నాకు డబ్బుతో పనేలేదు. నా వల్ల మా మామ కృష్ణ గారికి ప్రాణహానీ ఉందని నరేశ్ కృష్ణగారి ఫోర్జరీ సంతకంతో కోర్టులో సూట్ ఫైల్ చేశారు. ఇలాంటి పనులు చేయడంలో నరేశ్ దిట్ట అని నాకు ముందు నుంచే తెలుసు అందుకే నేను ఇవ్వన్నీ నమ్మలేదు. ఈ విషయాలను మా మామతో చెబుదామని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. కానీ వీటితో ఆయన గౌరవం దెబ్బతింటుందని వద్దన్నాను. ఇలాంటి పిచ్చి పనులు ఎన్ని చేసినా నరేశ్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు.’ అంటూ రమ్య రఘుపతి ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పింది.