పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బుల్లితెర రాములమ్మ

0
359

ప్రస్తుతం టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె పెళ్లి వార్తలపై చాలా కామెంట్లు రూమర్లు కొనసాగుతున్నాయి. జులాయి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ బుల్లితెర రాములమ్మ తర్వాత కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసినా ఈ మధ్య మాత్రం వెండితెరపై కనిపించడం లేదు. ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియా వార్తల్లో తెగ కనిపిస్తున్నారు. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఆమె నాన్నే ఆమెకు ఒక బడా బిజినెస్ మ్యాన్ ను వరుడిగా ఎంపిక చేశారని. ఇలా చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. ఈ గాసిప్ లకు ఫుల్ స్టాప్ పెట్టారు శ్రీముఖి.

ఇంటర్వ్యూలో శ్రీముఖి మనుసులోని మాట

ఇటీవల ఆమె ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ‘నా పెళ్లిపై వాచ్చే వార్తలన్నీ నిరాధారమే. అందులో ఎటువంటి నిజం లేదు. కావాలనే కొందరు వీటికి ప్రచారం కల్పిస్తున్నారు. పెళ్లి అనే టాపిక్ నాకు నా ఇంట్లో గానీ ఇంత వరకూ రాలేదు. ఒక వేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ముందుగా మీడియాకు చెప్పిన తర్వాతే చేసుకుంటాను. ఇంత తొందర ఎందుకు.

లేనిపోని గాసిప్ లను క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తే వార్తల్లో ఉంటాం కానీ కెరీర్ డెబ్బతింటుంది. ఇటీవల ఒక యూ ట్యూబ్ ఛానల్ వాళ్లు నా పక్కన మా నాన్న ఫొటో పెట్టి బ్లర్ చేసి ఇతడే శ్రీముఖీకి కాబోయే భర్త అంటూ ప్రచారం చేశారు. ఇది ఎంత దారుణం.. ఇలాంటివి చేసేప్పుడు ఒళ్లు కొంచెం దగ్గర పెట్టుకోవాలి. వీటిని చూస్తుంటే చాలా భయంగా, బాధగా అనిపిస్తుంటుంది.

వీటికి అస్సలు భయపడను

గిట్టనివారు కొందరు ఇలాంటి లేనిపోనివి క్రియేట్ చేసి నన్ను బయపెట్టాలని చూస్తున్నారనుకుంటా.. వీటిని నేను భయపడను, కనీసం పట్టించుకోను కూడా.’ మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని సదరు విలేకరి ప్రశ్నించగా.. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రస్తుతం చేతిలో చాలా షోలు ఉన్నాయి. బిజీగానే ఉన్నాను. వెండితెరపై రాణించేందుకు సన్నాహాలు చేస్తున్నా. ఇక ఇప్పుడే పెళ్లి చేసుకుంటే వచ్చే భర్త, ఆయన అభిరుచులు, అత్తింటి గౌరవం ఇలా చాలా కారణాలతో కెరీర్ లో మళ్లీ వెనక్కు వెళ్తానని భయంగా ఉంది.

ఒక వ్యక్తి చేతిలో

ఇంకో 4, 5 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోను. ప్రస్తుతం చాలా హ్యాపీగా గడుపుతున్నా. గతంలో ఒక వ్యక్తి చేతిలో శ్రీముఖి మోసపోయింది. అప్పటి నుంచి కొన్ని రోజులు డీప్రెషన్ లోకి వెళ్లి ఇటీవల షోలలో మళ్లీ కనిపిస్తూ అలరిస్తుంది. సింగిల్ లైఫ్ ను చాలా ఆనందంగా చూసుకుంటున్నానని, ప్రస్తుతం పెళ్లి ఆలోచనలు లేవని చెప్పుకచ్చింది. సెలబ్రటీలపై ఇలాంటి అర్థం పర్థం లేని రూమర్లు క్రియేట్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం కరెక్టు కాదంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.