వివాదంలో కల్యాణ్‌రామ్‌ డెవిల్‌ సినిమా

0
395
Kalyan Rams Devil movie in controversy

కష్టపడి సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దాన్ని వివాదాలు చుట్టుముట్టకుండా విడుదల చేసుకోవడం మరో ఎత్తు. ఇది నిర్మాతకు సంబంధించిన టెన్షన్‌. కానీ ఓ చిత్రానికి కష్టపడి దర్శకత్వం వహించి..

ప్రేక్షకులు మెచ్చేలాగా దాంట్లో నవరసాలను కలబోసి రూపొందిస్తే.. చివరాకరికి తెరమీద తన పేరు కాకుండా మరెవరి పేరో ఉంటే ఆ దర్శకుడి పరిస్థితి వర్ణనాతీతం. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు దర్శకుడు నవీన్‌ మేడారం.

Kalyan Rams Devil movie in controversy

5 రోజుల్లో ‘సలార్’ రాబట్టిన వసూళ్లను చూస్తే మెంటలెక్కిపోతారు!

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా, సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ కథానాయికలుగా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డెవిల్‌’. (ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌) అనేది ట్యాగ్‌లైన్‌. ఈనెల 29న భారీ ఎత్తున విదలౌతోంది. ఇదొక స్పై థ్రిల్లర్‌.

అయితే చిత్రానికి సంబంధించి వివాదం ఒకటి తెరమీదకు వచ్చింది. ఈ చిత్రానికి తానే దర్శకుడినని, ఎంతో కష్టపడి ఈ సినిమాను తాను రూపొందించానని, దాదాపు సినిమా అంతా తానే తీశానని, కేవలం చిన్న చిన్న ప్యాచ్‌వర్క్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని,

అయితే వాటిని పూర్తి చేసిన నిర్మాత అభిషేక్‌ నామా దర్శకుడిగా ఆయన పేరు వేసుకున్నాడంటూ చిత్ర దర్శకుడు నవీన్‌ మేడారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖను విడుదల చేశాడు.

ఇందులో… ఈ సినిమా కోసం నేను మూడు సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాను. నా ఎఫర్ట్స్‌ మొత్తం పెట్టాను. కథ, స్క్రీన్‌ప్లే, కాస్ట్యూమ్స్‌, లొకేషన్స్‌, సెట్స్‌ డిజైన్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను.

ఈ సినిమాను 105 రోజుల పాటు కరైకుడి, వైజాగ్‌, హైదరాబాద్‌లలో చిత్రీకరించాము. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడి పేరు మారిపోవడం బాధాకరం.

ఇప్పుడు కూడా నేను కామ్‌గా ఉంటే.. నేనే ఏదో తప్పు చేసినట్లు అవుతుందని ఈ లేఖను విడుల చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్న సమయంలో కొందరి నుంచి ఈగో సమస్యలు ఎదుర్కొన్నాను. అయినా ఫైనల్‌గా సినిమా ముఖ్యం కనుక సర్ధుకు పోయాను.

కానీ దర్శకుడిగా నాకు దక్కాల్సిన క్రెడిట్‌ను కొట్టేయడం బాధగా ఉంది. అయినా నేను ఎవరిమీద లీగల్‌ యాక్షన్‌ తీసుకునే ఉద్దేశంలో లేను అంటూ ఆ లేఖలో తన బాధను వెళ్లగక్కారు నవీన్‌. చూడాలి ఫిల్మ్‌ చాంబర్‌ పెద్దలు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో.