చిరంజీవికి మోడీ ట్వీట్.. ఆ విషయంపై అభినందించిన ప్రధాని

0
330

మెగాస్టార్ ను ప్రధాని మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి చిరంజీవి ఎంపికయ్యారు. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పురస్కారాన్ని ప్రకటించారు. దీనిపై ప్రధనమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవికి ట్విటర్ వేదికగా విషెశ్ తెలిపారు.

అన్ని తరాల ప్రేక్షకుల అభిమానం

చిరంజీవి విలక్షణ నటుడు. ఆయనది అద్భుత వ్యక్తిత్వం, భిన్నమైన నటతో అనేక పాత్రలు పోషించి అన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణను చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయనను కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. చిరంజీవికి ప్రత్యేకంగా అభినందలు’ అంటూ మోడీ ట్వీట్ చేశారు. పీఎం ట్వీ్ట్ కు మెగాస్టార్ స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు రావడం, పీఎం దానిపై స్పందించడం ఆనందంగా ఉందని చిరు చెప్పారు.

చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్

చిరంజీవి ఇప్పటి వరకూ 153 మూవీస్ చేశారు. 154వ చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బాబీ డైరెక్షన్ లో శృతీ హాసన్ తో కలిసి చిరంజీవి ఇందులో నటిస్తున్నారు. దీనిని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ లో కూడా నటిస్తున్నారు చిరంజీవి. ఇందులో తమన్నా చిరంజీవి సరసన నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది.