గ్రేట్ విజువల్స్ తో ఆకట్టుకున్న ‘హనుమాన్’ టీజర్

0
287

యంగ్ హీరో తేజా సజ్జ అమృతా అయ్యర్ జంటగా వస్తున్న చిత్రం ‘హనుమాన్’ ఈ చిత్రం టీజర్ నవంబర్ 21 (సోమవారం) విడుదలైంది. ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తుంగా నిరంజన్ రెడ్డి నిర్మాణత వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో మూవీని రిలీజ్ చేసేందుకు యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ ఒక్క రోజులోనే గ్రేట్ వ్యూస్ ను దక్కించుకుంది.

టీజర్ లో ఏముంది..

జలపాతాల వెంట గదను పట్టుకున్న భారీ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఆయన రాకను చూచిస్తూ ప్రకృతి సంకేతం ఇస్తుంది. సముద్రం ఒడ్డున కథానాయకుడు సజ్జా అపస్మారక స్థితిలో పడి ఉంటాడు. ఆయన ఎంట్రీ టీజర్ లో ఆసక్తి కరంగా ఉంటుంది. భయంకర సన్నివేశంలో అమృతా అయ్యర్, పెళ్లి కూతురు గెటప్ లో ఫైట్ సీన్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. రామజపం చేసుకుంటున్న హనుమంతుడు లోక కల్యాణం కోసం సూపర్ హీరోగా మారినట్లు టీజర్ చూస్తే అనిపిస్తుంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిని కనబరుస్తుంది. వీటి చిత్రీకరణ అద్భుతంగా సాగింది. గ్రేజ్ విజువల్స్ తో టీజరే సినీ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది.

సినిమాపై విపరీతంగా పెంచిన అంచనాలు

చిత్రీకరణ కూడా హాలీవుడ్ లెవల్ లో చాలా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. కెమెరా మన్ శివేంద్ర వర్క్ అదిరిందనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది. బిగ్ స్క్రీన్ పైనే మూవీ చూడాలనే ఇంట్రస్ట్ ను కూడా క్రియేట్ చేసింది. త్వరలో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని కే నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ చెప్పారు.