తెలుగు బిగ్ బాస్ లో సూపర్ స్టార్.. కన్నీళ్లు పెట్టుకున్న నాగ్

0
529

సూపర్ స్టార్ క్రిష్ణ మననుంచి దూరమై వారం గడుస్తుంది. కానీ ఆయనను ఒక్క రోజు కూడా స్మరించుకోకుండా ఉండలేకపోతున్నాం. బ్రెయిన్ స్ర్టోక్ తో ఆయన తుదిశ్వాస విడిచారు. అంత్య క్రియలకు ప్రముఖులు హాజరై ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కానీ నాగార్జున మాత్రం కనిపించలేదు. దీంతో చిత్ర వర్గాల్లో కొత్త రూమర్ మొదలైంది. నాగార్జున ఎందుకు రాలేదు. అంటూ సందేహాలు వినిపించాయి.

నాగార్జున మాత్రం కనిపించలేదు

సూపర్ స్టార్ భౌతిక దేహానికి నివాళి అర్పించేందుకు రెండు రాష్ర్టాల సీఎంలు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు, పవన్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, అఖిల్, నాగ చైతన్యతో పాటు దాదాపు ఇండస్ర్టీ మొత్తం తరలివచ్చింది. వీరితో పాటు టాప్ డైరెక్టర్లు కొరటాల శివ, త్రివిక్రమ్, మెహర్ రమేశ్ తదితరులు కూడా వచ్చారు. అందరిలో నాగార్జున మాత్రం కనిపించలేదు. నాగ చైతన్య, అఖిల్ వచ్చినా నాగార్జున ఎందుకు రాలేదు..? అన్న సందేహాలు వినిపించాయి.

అంత అభిమానించే వ్యక్తి కృష్ణగారే

వీటిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇలా స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నాగార్జున ‘వారసుడు’ చిత్రం తీశారు. ఇందులో నాగార్జున కృష్ణ కొడుకు పాత్రలో నటించారు. వీరి అనుబంధం చాలా గొప్పది. నాగేశ్వర్ రావు తర్వాత అంత అభిమానించే వ్యక్తి కృష్ణగారే అంటూ నాగార్జున సాలా సందర్భాల్లో చెప్పాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక రాలేకపోయాడని చెప్తున్నారు.

ఎప్పుడూ జీవించే ఉంటారని సంతాపం

బిగ్ బాస్-6 వేదికగా నాగార్జున సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. బిగ్ బాస్ షో స్ర్కీన్ పై కృష్ణ ఫొటో ఉంచి నివాళులర్పించారు. కృష్ణ గారు ఇండస్ర్టీకి కూడా పెద్ద దిక్కని తన తరం దాటి ప్రస్తుతం యంగ్ హీరోలందరికీ ఆయన ఆదర్శమని చెప్పారు. ఇండియన్ మూవీ ఇండస్ర్టీలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ కూడా ఆయనే అంటూ చెప్పారు. నార్త్ టూ సౌత్ టాప్ మోస్ట్ స్టార్స్ తో కలిసి ఆయన పని చేసినట్లు నాగ్ చెప్పారు. టాలీవుడ్ ఇండస్ర్టీలో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారని సంతాపం తెలిపారు నాగార్జున. దీంతో వీరిద్ధరి మధ్య ప్రేమాభిమానేలే తప్ప ఏమీ లేదన్న గాసిప్ లకు చెక్ పెట్టారు నాగ్.