టాలీవుడ్ కు మరో వారసుడు

0
395

టాలీవుడ్ లో వారసులకు కొదవే లేదు. నటనను కూడా వారసత్వంగా పంచుకుంటూ వస్తున్నారు మన హీరోలు. పూర్తి టాలెంట్ చూపుతూ సినీ అభిమానులను తన తండ్రుల కంటే ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే చిరంజీవి కొడుకు రాంచరణ్, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్, నందమూరి హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది.

ఎప్పుడా అంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్

ఇక నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్ లో ఎప్పుడా అంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీనికి మంచి టైం రావాలని యువరత్న చెప్పుకస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇండస్ర్టీలో మరో టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీకి మూవీ కూడా ఫిక్స్ అయ్యిందని ఇక అరంగేట్రం తథ్యమని చిత్ర వర్గాల్లో గాసిప్ మొదలైంది.

పేరు కూడా ‘ఆదిత్య 999 మ్యాక్స్’గా

విశ్వక్ సేన్ దర్శకత్వం, నిర్మాణ, తదితర రంగాల్లో బాధ్యతలు తీసుకొని చేసిన మూవీ ‘దమ్కీ’ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ న బాలకృష్ణ తన మనసులోని మాటలు చెప్పుకచ్చారు. తనకు కూడా దర్శకత్వం చేయాలని ఉందని, ఇప్పటి వరకూ ఆ ఛాన్స్ రాలేదన్నారు. తన ఫెవరేట్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పేరు కూడా ‘ఆదిత్య 999 మ్యాక్స్’గా అనౌన్స్ చేశారు బాలయ్య.

స్క్రీప్టు వర్క్ కూడా దాదాపుగా పూర్తయ్యిందంట

ఈ మూవీతో తన కొడుకును తెరంగేట్రం చేయాలని యోచిస్తున్నారట. అదే జరిగితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ కు వస్తాడన్న మాట. బాలకృష్ణనే ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది. స్క్రీప్టు వర్క్ కూడా దాదాపుగా పూర్తయ్యిందంట. ఈ సినిమా తన మొదటి డైరెక్షన్ కాబట్టి తన ముద్ర ఉండేలా బాలయ్య భావిస్తున్నారంట. ఇవన్నీ నిజమైతే మోక్షజ్ఞ ‘ఆదిత్య 999’లో అలరిస్తాడని చెప్పచ్చు.