గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మన సినిమాలు

0
260

ఇంటర్ నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను కేంద్ర ప్రభుత్వం 52 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ వేడుకలు ప్రస్తుతం గోవాలో కొనసాగుతున్నాయి. ఇక్కడ దేశీయ సినిమాలతో పాటు, అంతర్జాతీయ సినిమాలను కూడా ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా మన టాలీవుడ్ చిత్రాలు కూడా ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అందులో అఖండ, త్రిపుల్ ఆర్ సహా మరో ఐదు చిత్రాలు ఉన్నాయి. అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు నవంబర్ 20వ తేదీన ప్రారంభమయ్యాయి. 28వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇండియా ఇన్‌ఫర్‌మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ర్టీ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇందులో ఈ యేడు ఏకంగా టాలీవుడ్ కు చెందిన 5 చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు.

నవంబర్ 24న అఖండ

ఈ యేడు 53వ ఫెస్టివల్ ను ఇన్‌ఫర్‌మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ర్టీ ఘనంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ‘ఇండియన్ పనోరమా-2022’ విభాగంలో అఖండ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 175 డేస్ నడిచి రికార్డులు దక్కించుకుంది. ఇది విడుదలైన తర్వాత 50వ రోజు 103 సెంటర్లలోని థియేటర్లో కొనసాగడం రికార్డనే చెప్పాలి. ప్రస్తుతం 175 రోజుల పరుగును కూడా పూర్తి చేసుకుంది. చిత్రోత్సవ వేడుకల్లో అఖండ గురువారం (నవంబర్ 24)న ప్రదర్శిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు.

‘త్రిపుల్ ఆర్’ కూడా

ఈ చిత్రోత్సవంలో అఖండతో పాటు ‘త్రిపుల్ ఆర్’ కూడా ప్రదర్శించనున్నారు. ఇందులో గోవా జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద గొప్ప విజయాన్నే ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ జపాన్ లో ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

మేజర్

ఉగ్రవాదుల ముంబాయి నగరంపై దాడులు చేసిన తీరు (26/11), అందులో ఉగ్రవాదులతో పోరాడి మరణించిన మేజర్ ఉన్ని కష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’. ఇందులో అడవి శేషు మేజర్ రోల్ పోషించాడు. దేశభక్తిని చాటుకున్న మేజర్ కు ఈ చిత్రం నివాళిగా అక్కడ ప్రదర్శింప బడుతోంది.

విడుదలకు ముందే ప్రదర్శనకు

చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ‘ఖాదీరామ్ బోస్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను భారత మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. థియేటర్స్ లోకి రాని ఈ చిత్రం ఈ ఫిల్మ్ ఫెస్టివెల్ లో ప్రదర్శించనున్నారు. దీనితో పాటు గోవా మరో తెలుగు మూవీ ‘బండి’ని కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఎప్పడనేది స్పష్టంగా తెలియలేదు.

అవార్డు అందుకోనున్న చిరు

మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిలీ ఆఫ్ ద ఇయర్-2022’కు ఎంపిక చేసింది. ఈ అవార్డులను సంబంధిత శాఖ 2013 నుంచి కొనసాగిస్తూ వస్తోంది. అవార్డుతో పాటు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రూ. 10లక్షల నగదు, నెమలి జ్ఞాపికను అందించనుంది.