వరుసగా 14 శతదినోత్సవాల క్రెడిట్‌ ఆయనదే….

0
218

కొన్ని బిరుదులు కొందరికి అంతగా నప్పవు. కానీ మరికొన్ని బిరుదులు మాత్రం ఆయా వ్యక్తులకు టైలర్‌ మేడ్‌లా పక్కాగా సూటవుతాయి. అలాంటి టైలర్‌మేడ్‌ బిరుడు ‘దర్శకరత్న’కు వన్నె తెచ్చిన వ్యక్తి దాసరి నారాయణరావు.

చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా లేదు.. కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ బేధం లేదు.. ఒక జోనర్‌లో బంధీ కాలేదు.. పోస్టర్‌పై దాసరి నారాయణరావు అనే పేరు కనిపిస్తే చాలు జనం థియేటర్స్‌కు పోటెత్తటమే. అలాంటి క్రేజ్‌ను తనకు తానుగా సృష్టించున్నారు దాసరి.

తొలిసారిగా తెలుగు తెరకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం అనే సింగిల్‌ కార్డును పరిచయం చేసిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు.

యన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్రహీరోల రాజ్యం నడుస్తున్న తరుణంలో వారితో సినిమాలు చేస్తూనే కొత్త నటీనటులతో, కుటుంబ కథా చిత్రాలతో, స్త్రీ ప్రధాన చిత్రాలతో కూడా సూపర్‌హిట్‌లు కొట్టడం ఆయనకే చెల్లింది.

Mani Ratnam with Varma Katha Varma Superhits with Mani Katha

ఒకటి, రెండు విజయాలకే గర్వంతో పొంగిపోయే తారలు, దర్శకుల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాంటిది తొలి సినిమా మొదలుకుని, వరుసగా పద్నాలుగు శతదినోత్సవ చిత్రాల్ని అందించిన ఘనత స్వంతం చేసుకున్న దర్శక ధీరుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు.

తెలుగు సినిమా చరిత్రలో వరుస అప్రతిహత విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు దాసరి అని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

తొలి చిత్రం తాతా మనవడు తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన సంసారం సాగరం, బంట్రోతు భార్య, రాధమ్మ పెళ్లి, తిరుపతి, ఎవరికివారే యమునా తీరే, బలిపీఠం, దేవుడే దిగివస్తే, భారతంలో ఒక అమ్మాయి, స్వర్గం`నరకం, యవ్వనం కాటేసింది.

మనుషులంతా ఒక్కటే, ముద్దబంతి పువ్వు, పాడవోయి భారతీయుడా చిత్రాలు వరుసగా శతదినోత్సవాలు చేసుకున్నాయి. ఇది దర్శకుడిగా దాసరి ఆల్‌టైమ్‌ రికార్డ్‌.

ఇలా వరుసగా 14 సినిమాలు హిట్‌ కొడితే మరొకరైతే బాలీవుడ్‌ అని, హాలీవుడ్‌ అని నానా హంగామా చేసేవారు, ఆకాశానికి నిచ్చెనలు వేసేవారు.

కానీ దాసరి మాత్రం తెలుగు సినిమానే అంటిపెట్టుకునే ఉన్నారు. తొలి చిత్రం తాతామనవడు టైంలోని బోళాశంకరుడే… 151 సినిమాలు దర్శకత్వం వహించిన తర్వాత కూడా అదే బోళాతత్వాన్ని నిలుపుకోవడం గొప్పకాక మరేమిటి.