నాగబాబు, ప్రకాష్ రాజు లు ఎంత చెప్పిన వినలేదు.. అందుకే

0
617

‘మా’ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తన మార్క్ ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు’ అని చెప్పారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను” అని అన్నారు.

నాగబాబు, ప్రకాష్ రాజు లు ఎంత చెప్పిన వినలేదు

అలానే మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘మా’ కమిటీ మీటింగ్ జరిగిందని, వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని చెప్పారు. అలానే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ, వారు అందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ఇక చేసింది లేక నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. ఇందులో భాగంగా మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను మంచు విష్ణు తీసుకున్నారు. అయితే నాగబాబు, ప్రకాష్ రాజు కూడా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు.

ఈ మేరకు డాక్టర్ అనిల్ (మెడికవర్ హాస్పటల్) మాట్లాడుతూ.. ‘రొటీన్ గా చేసే హెల్త్ చెకప్ ఇవి. ఈ హెల్త్ చెకప్ లు మా సభ్యులకు చేయటం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు టెస్టులు చేస్తున్నాము’ అని అన్నారు. ఇంకా రఘుబాబు (‘మా’ జనరల్ సెక్రటరీ) మాట్లాడుతూ’ హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయి’ అని అన్నారు.

మా సభ్యుల ఆరోగ్యం చాలా ముఖ్యం

హీరో శివబాలాజీ (‘మా’ ట్రెజరర్) మాట్లాడుతూ.. హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. ‘మా’ సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు. అలానే మాదాల రవి (‘మా’ వైస్ ప్రెసిడెంట్) మాట్లాడుతూ.. “మా సభ్యుల ఆరోగ్యం చాలా ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి ఎంతో కృతజ్ఞతలు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకున్నాము. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.