ఇకపై అమ్మాయిలు 21 ఏళ్ళ వరకూ ఆగాల్సిందే..!

0
1073

ఇప్పటి దాకా అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18 ఏళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఆ కనీస వయసు 21 ఏళ్ళు కానుంది. ఈ మేరకు అమ్మాయిల కనీస పెళ్లి వయసు ప్రతిపాదనకి కేంద్ర కేబినెట్‌ భేటీ లో ఆమోదం లభించింది. అమ్మాయిల కనీస పెళ్లి వయసు పెంచుతామని ఇప్పటికే ప్రధాని స్వాతంత్య్ర దినోత్సం రోజున ప్రకటించగా.. దాని అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్‌ భేటీ లో ఆమోదం లభించింది. తమ ప్రభుత్వం మహిళల ఆరోగ్యము గురించి శ్రద్ద వహిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా చిన్న వయసులో పెళ్లి చేస్తే తల్లి, పిల్లలను పోషహకార లోపం నుంచి కాపాడాలని చెప్పారు.

ఈ మేరకు వారి వివాహ పెంచాల్సిన అవసరం ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. కాగా ఇప్పటి దాకా అబ్బాయిల కనీస పెళ్లి వయసు 21 ఏళ్లుగా ఉంది. అయితే అబ్బాయిల వయసులో తేడా ఏమి చెప్పలేదు. అమ్మాయిల కనీస పెళ్లి వయసు 21 ఏళ్లుగా నిర్ణయించారు. ఇదిలా అండగా హిందూ వివాహాల చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టాలలో పెను మార్పులు తీసుకొచ్చేవిధంగా కేంద్ర ద్రుష్టి సారిస్తుంది. జయ జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ ఈ మేరకు అమ్మాయిల కనీస పెళ్లి వయసు 21 ఏళ్ళ ప్రతిపాదనకు మద్దత్తు తెలిపింది.

అమ్మాయిలు పెళ్లి తరువాత తొలి గర్భం దాల్చాలంటే కనీసం 21 ఏళ్ళు ఉండాలని టాస్క్‌ఫోర్స్ చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదనకు డిసెంబర్‌ నెలలోనే సిఫారస్సులు సమర్పించగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది. కాగా.. 21 ఏళ్ళ అమ్మాయి, 21 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చా? ఇద్దరి మధ్య వయసులో తేడా లేకపోతే ఏమైనా సమస్యలు వస్తాయా? అని వేచి చూడాల్సిందే.