LIC క్లాసిక్ క్రెడిట్ కార్డులు బెనిఫిట్స్ వివరాలు

0
357
lic credit card benifits

LIC సంస్థ రెండు ప్రత్యేకమైన క్రెడిట్ కార్డుని లాంచ్ చేసింది. ఒకటి LIC క్లాసిక్ కార్డు కాగా, మరొకటి LIC సెలెక్ట్ కార్డు. ఈ రెండు కార్డులు డిసెంబర్ 14 వ తారీఖు నుండి అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు ఈ కార్డుల ద్వారా కలిగే ఉపయోగం ఏమిటంటే అతి తక్కువ వడ్డీ రేట్లు ఉండడమే. జాయినింగ్ ఫీజు కూడా లేదట. వ్యక్తిగత ప్రమాద భీమా ఒక్కో మనిషికి దాదాపుగా 5 లక్షల రూపాయిల వరకు ఉంటుందట.

ఈ రెండు క్రెడిట్ కార్డులో వినియోగదారులను ఆకర్షించే ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఆఫర్లు కూడా ఉన్నాయి. అంతే కాదు రివార్డు పాయింట్స్ కూడా లభిస్తాయట. ఎలాంటి LIC పాలసీ తీసుకోకపోయినా కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అట. ఒకవేళ LIC పాలసీ వినియోగదారుడు ముందుగానే కలిగి ఉంటే చెల్లించే ప్రీమియం పై రివార్డ్స్ ని కూడా గెలుచుకోవచ్చు అట. రెండు కార్డులను పోల్చి చూస్తే, రెండిటికి సరిసమానమైన ఉపయోగాలు ఉన్నాయి.

lic credit card benifits

మ్యాప్స్ ద్వారా పెట్రోల్, డీజల్ ఆదా

ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. క్లాసిక్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్, ఫీచర్లు ఒకసారి పరిశీలిద్దాం చూద్దాం. ఈ క్రెడిట్ కార్డు కొరకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు లేదు. ఒక్కో నెలకు 0.75 శాతం నుంచి సంవత్సరానికి 9 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. గరిష్టంగా నెలకు 3.5 శాతం, సంవత్సరానికి 42 శాతంగా ఉంది. అలాగే క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు.. 48 రోజుల వరకు అన్నీ ఏటీఎంల్లో విత్ డ్రా చేసుకోవచ్చు.

దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.ఇక EMI ల విషయానికి వస్తే ప్రతీ ట్రాన్సాక్షన్‌పై రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. జాయినింగ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కార్డు జనరేట్ అయిన 30 రోజుల్లోగా రూ. 5000 ఖర్చు చేస్తే 1000 రివార్డు పాయింట్లు వస్తాయి. ఇదే సమయంలో మొదటి EMI పైనా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

యాత్రా యాప్ లో డొమెస్టిక్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే రూ. 500 తక్షణ డిస్కౌంట్ ఉంటుంది అట. అలాగే రూ. 399 విలువైన 6 నెలల PharmEasy Plus మెంబర్‌షిప్ ఉచితంగా లభించనుంది. అలాగే రూ. 500 విలువైన లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్ ఏడాది ఉచితం. ఈ కార్డులకు సంబంధించిన మరిన్ని వివరాల కొరకు LIC వెబ్సైటు లోకి వెళ్లి ఒకసారి పరిశీలించొచ్చు.