చాణక్యుడి నీతి: విజయం సాధించాలంటే ఇలా చేయాలి

0
294
chanikhya suthraalu

చాణక్యుడు తన జీవితం లో ఎన్నో విలువైన సూత్రాలను చెప్పాడు. చాలా మందికి ఉపయోగకరమైన మాటలు చెప్పాడు. చాణక్యుడి మాటలు పాటిస్తే.. జీవితంలో విజయం సాధించొచ్చు. చాణక్య నీతిని ఇప్పటికీ ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు.

ముఖ్యంగా విజయం సాధించడానికి ఆయన చెప్పిన సూత్రాలు ఎంతో గొప్పవి. జీవితం లో ఎలాంటి పనులు చెయ్యకూడదు అని తెలిసి ఉన్నవాడు., తప్పకుండ విజయం సాధిస్తాడు అని ఆయన చెప్పిన నీతులలో ఒకటి.

ఇది ఇలా ఉండగా విద్యార్థులు కూడా చాణక్యుడు చెప్పిన నీతులను అనుసరించడం వల్ల విజయాలు సాధించవచ్చు. వాళ్ళు జీవితం లో సక్సెస్ ని చూసేందుకు, సరైన విద్యని పొందేందుకు చాణక్యుడి సూత్రాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆయన చెప్పిన కొన్ని సూత్రాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఆచార్య చాణక్య ప్రకారం కామంతో కూడిన మనస్సు ఉన్నవాడు తానూ చేసే ఎప్పటికీ తప్పులను గుర్తించలేడు. ఒక విద్యార్థి మోహానికి లోనైతే, అతను చదువుకోలేడు. చదువుకునే విద్యార్థులు ఇలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలి. మనసులో ఎదో ఒకటి సాధించాలి, తమ లక్ష్యం కి ఎలా అయినా చేరుకోవాలి అని కోరిక ఉన్నవాడు కామం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

తన కోపమే తన శత్రువు అనేది చాణక్యుడి నీతులలో ఒకటి..కోపం లో ఉన్నప్పుడు మన అస్తిత్వం ని కోల్పోయి కొన్నిసార్లు రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కోపంని పూర్తిగా త్యజించాలి. ఏదైనా నేర్చుకునేందుకు ప్రశాంతత, సహనం చాలా ముఖ్యం. గెలుపు సాధించాలంటే కోపాన్ని ఆపుకోవాలి.

chanikhya suthraalu

పెళ్లైన మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడడానికి కారణాలు

వస్తువులపై వ్యామోహం కూడా మనం జీవితం లో విజయం సాధించే దారిలో అడ్డంగా నిలవగలడు. అలాంటి వ్యక్తికి తన జ్ఞానంపై దృష్టి పెట్టలేడు.అలాంటి సమయం లోనే మన మనసులోకి దురాశ పుడుతుంది. దురాశకి లోబడిన మనిషి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నట్టే.

చాణక్య సూత్రం ప్రకారం, ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారం కోసం వేటలో ఉంటాడు. ఆరోగ్యం, అభ్యాసం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడానికి వారి నాలుకను నియంత్రించుకోవాలి. అలాంటి వారు తమకు లభించిన దానిని ఆస్వాదిస్తూ విజయం వైపు పయనిస్తారు.

అలంకారంలో ఎక్కువ సమయం వృథా చేయకూడదు. రెడీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునేవారు.. దాని మీదనే ఫోకస్ చేస్తారు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ఒకే చోట ఏకాగ్రతతో నేర్చుకోడు. ఈ పరిస్థితులను నివారించి ఆదర్శంగా నిలిచే వారు తప్పకుండా విజయం సాధిస్తారు.