పల్లవి ప్రశాంత్ కి14 రోజులు రిమాండ్

0
298
pallavi prasanth jail

స్టార్ మా ఛానల్ లో నిన్న మొన్నటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో కానీ, ఎంటర్టైన్మెంట్ ని పంచడం లో కానీ ఈ సీజన్ గత సీజన్స్ తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ అని హోస్ట్ నాగార్జున సైతం చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ సీజన్ లో ఒక సామాన్య రైతు బిడ్డగా అడుగుపెట్టి టైటిల్ విన్నర్ గా నిలిచి పల్లవి ప్రశాంత్ చరిత్ర తిరగరాశారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అతను ప్రవర్తించిన తీరుకు ఇన్ని రోజులు అతనిని సపోర్ట్ చేసిన వారు కూడా చిరాకు పడేలా చేస్తుంది.

pallavi prasanth jail

ముఖ్యంగా రైతు బిడ్డ ట్యాగ్ ని ఉపయోగించుకొని అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని, గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ర్యాలీ నిషేధం అని చెప్పినప్పటికీ కూడా అతను వినకుండా పోలీస్ రూల్స్ ని అతిక్రమించాడని, పోలీసులు అతని పై కేసు నమోదు చేసారు.

ముందుగా అతని తమ్ముడు మరియు స్నేహితుడిని అరెస్ట్ చెయ్యగా, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని నిన్న తన నివాసం లో పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. 14 రోజుల పాటు పల్లవి ప్రశాంత్ రిమాండ్ లోనే ఉండాలి.

ఆయనపై నాన్ బైలబుల్ కేసులు నమోదు అయ్యాయి కాబట్టి అంత తేలికగా బయటకి వచ్చే ఛాన్స్ లేదు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి పల్లవి ప్రశాంత్ కి శివాజీ అండగా నిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయనకి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పల్లవి ప్రశాంత్ ని బయటకి తీసుకొస్తే తప్ప , అతను ఇప్పట్లో బయటపడే అవకాశం లేదని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

జైలుకు వెళ్తున్న సమయం లో ఆయన కెమెరా ని చూడగానే పుష్ప మ్యానరిజం ని అనుకరిస్తూ భుజం పైకి లేపడం ని చూస్తుంటే పల్లవి ప్రశాంత్ ఏ స్థాయిలో బిగ్ బాస్ హౌస్ లో నటించి జనాలను ఏమార్చాడో అర్థం చేసుకోవచ్చు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.