బుర్ర ఉన్నోడు ఎవడైనా నిన్న చంపాలని అనుకోడు అంటూ రామ్ గోపాల్ వర్మ పై సెటైర్లు వేసిన నాగబాబు!.

0
161
Nagababu satires on Ram Gopal Varma

ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ, ఈసారి ‘వ్యూహం’ అనే మరో వివాదాస్పద సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జగన్ కి సపోర్టుగా, పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కి వ్యతిరేకంగా తీసాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

టీజర్ మరియు ట్రైలర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో పక్క టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా లో రామ్ గోపాల్ వర్మ ని కబడ్డీ ఆడుకుంటున్నారు.

Nagababu satires on Ram Gopal Varma

40 ఏళ్ళ వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..వరుడు ఎవరో మీరే చూడండి!

మీడియా లైవ్ డిబేట్స్ లోకి వచ్చి రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వాడికి డబ్బులు ఇస్తాము అని బహిరంగంగా ఆఫర్లు ఇస్తున్నారు.

దీనికి రామ్ గోపాల్ వర్మ బయపడి, నాకు ప్రాణహాని ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనిపై నాగబాబు రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ రామ్ గోపాల్ వర్మ గారిని అలా బెదిరించడం చాలా తప్పు, దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..రామ్ గోపాల్ వర్మ గారు, మీరు సంతోషం గా ఎలాంటి నిశ్చింత లేకుండా ఉండండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారత దేశం లో ఎవ్వడూ కూడా రామ్ గోపాల్ వర్మ ని చంపాలని అనుకోడు.

ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటున్నప్పుడు, మధ్యలో వచ్చే కమెడియన్స్ ని ఎవ్వరూ పట్టించుకోరు కదా, కాబట్టి నీకు ఎలాంటి ప్రాణ భయం లేదు. హ్యాపీ గా వోడ్కా తాగి పడుకో’ అంటూ రామ్ గోపాల్ వర్మ పై సెటైర్ల వర్షం కురిపించాడు.

దీనికి రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నాగబాబు మరియు రామ్ గోపాల్ వర్మ మధ్య ఈ గొడవలు నిన్న మొన్నటివి కాదు, ఎప్పటి నుండో జరుగుతూనే ఉన్నాయి.

రామ్ గోపాల్ వర్మ ని బహిరంగ ఈవెంట్స్ లో కూడా నాగబాబు కడిగిపారేసేవాడు. ఇక ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో అయితే ఎన్ని సార్లు తిట్టి ఉంటాడో లెక్కే లేదు.

ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ మీద కూడా రామ్ గోపాల్ వర్మ కచ్చితంగా రియాక్షన్ ఇస్తాడు. ఆ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు.