నన్ను చంపటానికే ఈరోజు నుంచి సెక్యూరిటీ తొలగించారు

0
411
B.tech Ravi removed security from today to kill me

ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులకు ప్రభుత్వాలు సెక్యూరిటీని ఇస్తుంటాయి. ముఖ్యంగా కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షన్‌ గొడవలు జరిగి ప్రాంతాల నాయకులకు అయితే తప్పనిసరిగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు.

ఇది ఒకప్పటి ప్రభుత్వాలు అనుసరించే తీరు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాల్లోకి వ్యక్తిగత కక్షలు చొరబడడంతో తమకు ఇష్టమైన వారికి ఒకలాంటి సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్‌, ఇష్టంలేని(ప్రతిపక్ష పార్టీ నాయకులకు)

వారికి ఒకలాంటి సెక్యూరిటీ అనే కొత్త వివాదాన్ని అనుసరిస్తున్నారు. ఈ రకమైన వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కామన్‌ అయిపోయాయి.

B.tech Ravi removed security from today to kill me

బుర్ర ఉన్నోడు ఎవడైనా నిన్న చంపాలని అనుకోడు అంటూ రామ్ గోపాల్ వర్మ పై సెటైర్లు వేసిన నాగబాబు!

తాజాగా పులివెందులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్‌ రవికి ప్రభుత్వం ఈ రోజు నుంచి సెక్యూరిటీని తొలగించింది. ఇటీవలే ఆయన్ను పోలీసులు సీక్రెట్‌గా అదుపులోకి తీసుకున్న విషయం వివాదస్పదం అయిన విషయం తెలిసిందే.

తనన చంపటానికే పోలీసులు ప్రయత్నించారని అప్పుడు బీటెక్‌ రవి ఆరోపించిన విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఈరోజు తన సెక్యూరిటీని తొలగించడంపై స్పందించిన ఆయన మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నన్ను చంపే కుట్ర ఈ ప్రభుత్వంలో జరుగుతోంది. ఇప్పటికే నా మీద హత్యాప్రయత్నం కూడా జరిగింది. మొన్న పోలీసులు పెట్టిన కేసులో నేను ప్రతి ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి రావాలి.

సో నాది ఫిక్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇప్పుడు సెక్యూరిటీని తీసేస్తే.. నా శత్రువులకు దారి సుగమం అయినట్లే. పోనీ నాలుగైదు కార్లలో వెళ్దామంటే ఏవేవో సెక్షన్‌లు చెప్పి ఒక్క కారునే అనుమతిస్తారు. ఇదేమి రాజ్యం.

ఖచ్చితంగా వాళ్లకు మమ్మల్ని ఏదో చేయాలనే ప్లాన్‌ ఉంది. కాబట్టి దీన్ని సుమోటాగా తీసుకోవాలని హైకోర్టుకు వెళ్తున్నాం.

నాకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి పూర్తిగా జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలదే పూర్తి బాధ్యత. ప్రతిపక్షాలతో రాజకీయం చేసి గెలవాలి గానీ, ఇలా అక్రమపద్ధతుల్లో నిరోధించే కార్యక్రమాలు చేపట్టడం ఏ పార్టీకి అంత మంచిది కాదు అన్నారు.