రాత్రిపూట కర్ఫ్యూకు కేంద్రం సిద్ధమౌతోందా?

0
329
Center preparing for night curfew

ప్రపంచాన్ని వణికించి లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచం మామూలు స్థితికి వస్తున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌`1 మళ్లీ ప్రపంచాన్ని కుదిపేయటానికి వేగంగా విస్తరిస్తోంది.

కొద్ది నెలల క్రితం ఈ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ ఇది అంత తీవ్రమైనది కాదు అనుకున్నారు. కానీ తాజాగా భారతదేశంలో ఈ వేరియంట్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది.

తాజాగా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు 4 వేలకు పైగానే నమోదు అయ్యాయి. దాదాపు 60కి పైగా జేఎన్‌`1 వేరియంట్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Center preparing for night curfew

పార్లమెంట్‌ దాడి కేసు.. జగ్గయ్యపేటలో విచారణ..

గోవాలో కొత్త వేరియంట్‌ కేసులు 34 నమోదు అవ్వగా, మహారాష్ట్రలో 9 కేసులు నమోదు అయ్యాయి. దక్షిణాదిన కర్నాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం చలికాలం కావున దీని విస్తరణకు అనుకూలంగా ఉంటుంది.

కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంతో పాటు అమెరికా, సింగపూర్‌, చైనా దేశాల్లో కూడా ఈ వేరియంట్‌ బయపడిరది.

అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో దీని విస్తరణ మొదలైతే కంట్రోల్‌ చెయ్యడం కష్టం. ఈ విషయం గతంలో కరోనా విలయతాండవం చేసిన రోజుల్లో మనం చూశాం.

ప్రస్తుతం ఈ కేసుల తీవ్రతను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. కరోనా తీవ్రత మళ్లీ కొద్ది కొద్దిగా ఎక్కువౌతుండడంతో అవసరం అయితే ఇదివరకటిలా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై నివేదక ఇవ్వాలని కేంద్రం ఉన్నతాధికారులను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే రాష్ట్రాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ చలికాలం వరకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్రం.