అతను చేసిన పిచ్చి పనికి రక్తంలోనే పుట్టగొడుగు పెరిగాయి

0
513

ఒక్కోసారి మనం చేసే స్వంత వైద్యం ఆలోచనలు మన జబ్బులను తగ్గించడం ఏమో గానీ.. మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇలా ఓ పిచ్చి ఆలోచనతో రక్తంలో పుట్టగొడుగులు పెరగడం మొదలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ వ్యక్తి. అమెరికాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బైపోలార్‌ డిజార్డర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు. కొంతకాల0 డాక్టర్స్‌ ఇచ్చిన మందులు వాడాడు. తన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలనే అలోచనతో గూగుల్‌లో సెర్చ్‌ చేశాడట.

మానసిక ఆందోళనను దూరం చేసే మందు ఎందులో ఎక్కువగా లభిస్తాయి అని అతను చేసిన సెర్చ్‌కు సిలోసిబిన్‌ అనే విటమిన్‌ు పరిష్కారంగా కనిపించాయి. ఇవి ఎక్కువగా పుట్టగొడుగుల్లో లభిస్తాయి. అంతే మనోడు కార్యరంగంలోకి దూకాడు. పుట్ట గొడుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా సిలోసిబిన్‌ నెమ్మదిగా శరీరంలోకి చేరి తన పని ప్రారంభిస్తుంది. కానీ మనోడు అప్పటిదాకా ఆగలేక పోయాడు. పుట్టగొడుగులు తింటూ కూర్చుంటే ఎప్పటిక తెమిలేను కథ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పుట్టగొడుగులను నీళ్లలో బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు.

ఇలా చేసిన రెండు రోజు తర్వాత మనోడు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. డయేరియాతో పాటు జాండిస్‌ క్షణాలు కూడా మొదలయ్యాయి. రక్తం వాంతులు చేసుకుంటున్నాడు. భయపడిన అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికీ అతను డాక్టర్లకు జరిగిన విషయం చెప్పలేదు. డాక్టర్లకేమో విషయం అర్ధం కావడం లేదు. అవయవాలు ఒక్కొక్కటి పాడై పోవడం మొదలు పెట్టాయి. చావు భయంతో అప్పుడు జరిగింది డాక్టర్లకు చెప్పాడు.

పుట్టగొడుగుల రసాన్ని ఎక్కించుకోవడం వలన పుట్టగొడుగుల్లో ఉండే సైలోసైబ్‌ క్యూబెన్సిస్‌ అనే ఫంగస్‌ మనోడి రక్తంలో చేరి పుట్టగొడుగులు పెరిగే వాతావరణం కల్పించడం మొదలెట్టాయి. 22 రోజు పాటు కృత్రిమ శ్వాస ద్వారా అతని ప్రాణాలు కాపాడారు డాక్టర్లు. ఈ విషయాన్ని హెల్త్‌ జర్నల్‌ ‘అకాడమీ ఆఫ్‌ కన్సులేషన్‌ లియిసన్‌ సైకియాట్రీ’ తన తాజా సంచికలో ప్రచురించింది.