మీడియాపై చిందులు తొక్కిన ముఖ్యమంత్రి

0
422

సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలును, అలాగే మంచి పరిణామాలను వెలికి తీసి ప్రజలకు తెలియజేయడం మీడియా పని. ఈ క్రమంలో బాధ్యత గల వ్యక్తులను ప్రశ్నించడం దాని విధి. ఇలా తమ విధులను నిర్వర్తిస్తున్న మీడియాపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు.. అంతటితో ఆగలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాలపై మీరు ఇంత ఇదిగా ఎందుకు హైలెట్‌ చేయలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
విషయంలోకి వెళితే ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఇండిగో మేనేజర్‌ రూపేశ్‌కుమార్‌ సింగ్‌ హత్యకు గురయ్యారు.

అదీ ముఖ్యమంత్రి నివాసానికి కేవం 2 కిలోమీటర్ల దూరంలోనే. మంగళవారం ఆయన తన ద్విచక్ర వాహనంపై నిలిచి ఉండగానే దుండగులు జరిపారు. ఇది బీహార్‌లో పెద్ద సంచలనంగా మారింది. మీడియా కూడా దీన్ని బాగా హైలైట్‌ చేసింది. అనేక ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాను కూడా ఎండగట్టే వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మీడియాపై గుర్రుగా ఉన్నారు. శుక్రవారం తనను కలిసిన మీడియాపై ఆయన చిందులు వేశారు. ‘‘హత్య జరిగిన మాట వాస్తవమే. పోలీసులు కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి. దయచేసి పోలీసులకు సహకరించండి. అంతేగాని అనుచిత ప్రశ్నలు వేయకండి. మీరు చాలా గొప్పవారు. పదిహేను సంవత్సరాల భార్య, భర్తల పాలనలో ఎన్నో నేరాలు జరిగిన విషయం తెలిసిందే కదా. అప్పుడు వాటిని ఎందుకు హైలైట్‌ చేయలేదు’’ అంటూ బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు, ఆయన భార్య రబ్రీదేవిపై పరోక్షంగా విరిచుకు పడ్డారు. అంతటితో ఆగకుండా మీడియాను ఉద్దేశించి మిమ్మల్ని మేము గౌరవిస్తాం. అంతేగాని ప్రత్యేకంగా సహాలు ఇస్తుంటే ఎలా. ఇలాంటి వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా ఇవ్వాలి అంటూ నోటికొచ్చింది మాట్లాడారు.