జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

0
262
Ambati Rayudu who gave a shocking shock to Jagan

రాజకీయం అంటే అంతే. ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్నాయి.

ఓ వైపు అన్నకి షర్మిల జర్కులు ఇస్తూనే ఉంది. మరో వైపు పార్టీ నేతలు కూడా జగన్ కి జర్కులు ఇస్తున్నారు.

ఇక తాజాగా జగన్ మరో వైసిపి నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అతడు మరెవరో కాదు. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు.

సరిగ్గా వారం రోజుల క్రితమే అంబటి రాయుడు జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. చేరిన వారం రోజులకే ఇప్పుడు పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ ట్విట్ లో పేర్కొన్నారు. దీనితో ఒక్కసారిగా వైసిపిలో అలజడి నెలకొంది.

is-sharmila-more-dangerous-to-jagan-than-tdp-jana-sena

అయితే టికెట్ హామీ జగన్ ఇవ్వలేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి ఉంటారని టాక్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా పార్టీలో చేరిన వారం రోజులకే బయటికి రావడంతో.. ఇప్పుడు ఏపీ రాజకేయాలు మరింత వేడెక్కాయి. జగన్ మాత్రం గెలుపు గుర్రాలకే టికెట్ లు ఇస్తానని ఖరాకండిగా చెప్పేస్తున్నారట.

ఎంతటి వ్యక్తి అయినా, మినిస్టర్ అయినా సరే.. తాను చేయించిన సర్వే ప్రకారం రేసులో ఉన్న నేతలకి టికెట్ ఇస్తున్నారట.

అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని వైసిపిలో చేర్చుకుంటే.. పార్టీకి లాభం ఉంటుందని అందరూ భావించారు. అయితే కేవలం టికెట్ రాలేదని వారం రోజులకే ఇలా నిర్ణయం తీసుకోవడంపై అంబటి రాయుడుపై విమర్శలు వస్తున్నాయి.

పార్టీలు మారడం సహజమే అయినా.. వారం రోజుల కింద పార్టీలో చేరి.. ఇప్పుడు ఇలా సంచలన నిర్ణయం చేసుకోవడం విశేషం. అయితే.. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో జనసేనలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.