పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటూ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్!

0
218
Minister Rojas shocking comments saying that Chandrababu is backstabbing Pawan Kalyan!

వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆధారంగా తీసుకొని వ్యూహం అనే చిత్రం చేసాడు.

ఈ సినిమా సీఎం జగన్ కి అనుకూలంగా, పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కి వ్యతిరేకంగా ఉంటుంది. సీఎం జగన్ ఈ సినిమా చేయాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ ని ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చెయ్యడం తో అతని ఫండింగ్ తోనే ఈ సినిమాని చేసాడు.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న విజయవాడ లో చేసాడు రామ్ గోపాల్ వర్మ.

Minister Rojas shocking comments saying that Chandrababu is backstabbing Pawan Kalyan!

పీకేకు సోషల్‌ మీడియా ప్రచార బాధ్యత మాత్రమే?

ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు రోజా, అంబటి రాంబాబు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మంత్రి రోజా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ… వ్యూహం సినిమా దర్శకుడికి ప్రత్యేక అభినందనలు చెప్పింది. విజయవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ అని తెలిపింది.

శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి… బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ అని మంత్రి రోజా కొనియాడారు. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనమని వెల్లడించింది.

‘వ్యూహం’ టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయిందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అసలు పనికిరాడని, చంద్రబాబు నాయుడు ఎదో ఒక రోజు అతనికి కూడా వెన్నుపోటు పొడుస్తాడని,

పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు లో చంద్రబాబు కి సపోర్ట్ చేసి తన వర్గపు జనాలను కూడా వెనుపాటు పొడిచాడని , ఇవన్నీ ఈ వ్యూహం సినిమాలో చూపించారు అంటూ రోజా చెప్పుకొచ్చింది. ఈ సినిమాని ఆపేందుకు చంద్రబాబు

మరియు అతని పుత్ర రత్నం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అది అసాధ్యం అంటూ ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .