‘సలార్’ అట్టర్ ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేసిన స్టార్ హీరో ఫ్యాన్..ఆవేశం తో రగిలిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

0
356
The star hero's fan commented that 'Salar' was an utter flop.

బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో కబడ్డీ ఆడుకోవడం ప్రభాస్ కొత్తేమి కాదు, బాగా అలవాటు అయిపోయింది కూడా. బాహుబలి సిరీస్ తర్వాత ఇండియా లో ఏ స్టార్ హీరో కూడా అందుకోని రేంజ్ వసూళ్లను రాబడుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నిటికి ఫ్లాప్ టాక్స్ వచ్చాయి.

అయినప్పటికీ కూడా అవి టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టేవి. ఇకపోతే రీసెంట్ గా విడుదలైన సలార్ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే మన స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ వసూళ్లను మొత్తం మడతపెట్టేసింది.

The star hero's fan commented that 'Salar' was an utter flop.

విజయ్ లియో చిత్ర ఓపెనింగ్స్ ని దాటలేకపోయిన ప్రభాస్ ‘సలార్’

రెండు రోజుల్లో 250 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇంతటి స్టార్ స్టేటస్ చూసిన తర్వాత ఎవరికైనా అసూయ రావడం సహజం. ఆ అసూయ తో ప్రభాస్ మీద ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటున్నారు ఈమధ్య కొంతమంది ప్రముఖులు.

అలాగే ప్రభాస్ స్టార్ స్టేటస్ ని చూసి ఇతర హీరోల అభిమానులు కూడా అలాగే కుళ్ళుకుంటున్నారు. తమ అభిమాన హీరోల కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని కేవలం రెండు రోజుల్లో దాటేస్తే ఎవరికైనా కాలుద్ది కదా, అదే ఇప్పుడు జరిగింది.

ఒక వ్యక్తి ఈ చిత్రాన్ని చూసి థియేటర్ బయటకు వచ్చి ప్రభాస్ మీద చేసిన పలు అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇతను కనిపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఇరగకుమ్మేసేలా ఉన్నారు. ఆ స్థాయిలో ఆయన కామెంట్స్ చేసాడు.

ప్రభాస్ సినిమాలకు ప్రభాస్ మైనస్ అవుతున్నాడని, ఎంత బడ్జెట్ పెట్టినా కూడా యాక్టింగ్ రాని ప్రభాస్ కారణంగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, ఇప్పుడు సలార్ చిత్రం లో కూడా ఆయన నటన దరిద్రం గా ఉందని, అతని వల్లే కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయని, ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎన్ని విధాలుగా రెచ్చగొట్టాలో అన్ని విధాలుగా రెచ్చగొట్టేసాడు.

ఇతని కామెంట్స్ ని చూసి అభిమానులు వెర్రిక్కిపోయారు. కనిపిస్తే చితకబాది క్షమాపణలు చెప్పించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు.

మరి ఇతగాడు దొరుకుతాడో లేదో చూడాలి మరి. ఇకపోతే ‘సలార్’ చిత్రం మూడవ రోజు కూడా దుమ్ములేపేసింది. ఈరోజుతో ఈ చిత్రం 350 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక క్రిస్మస్ రోజు ఈ సినిమా సృష్టించే విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అని ట్రేడ్ పండితులు అంచనా వేసుకుంటున్నారు.