‘యశోద’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

0
654

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యశోద’ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ రేట్ ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ‘యశోద’ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్ లో నవంబర్ 11న రిలీజ్ అయ్యింది. విడుదల తర్వాత వీకెండ్ కావడంతో మూవీపై ఉన్న హైప్ తో ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. రిలీజ్ కు ముందే ఈ మూవీ సేఫ్ లోకి వెళ్లిందనే చెప్పాలి. ఈ సినిమాలో నటి సమంత తనదైన స్టయిల్ లో విశ్వరూపం చూపించింది.

కలెక్షన్లలో డల్

అద్భుతమైన నటనతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించింది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సుమారు రూ. 40 కోట్ల బిజినెస్ తో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా బ్రేక్ చేసిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో చిత్ర సీమంతా విషాదంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్లలో కొంచెం వెనుబడింది. వెంట వెంటనే గాలోడు, మసూద మూవీలు రిలీజ్ కావడంతో కలెక్షన్లలో డల్ అయిపోయింది. కానీ ఇప్పటికీ సెటిల్డ్ గానే రన్ అవుతోంది.

చికిత్స పొందుతుందనే సెంటిమెంట్

నాగ్ తో విడాకుల తర్వాత సామ్ మొదటి సినిమా కావడం. ఆమె వయోసైటీస్ గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతుందనే సెంటిమెంట్ కూడా ఈ చిత్ర విజయానికి కారణం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏది ఏమైనా ఈ మూవీలో సమంత పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కావడంతో ఇతర రాష్ర్టాల్లోని కలెక్షన్లు కూడా కలిసివచ్చాయని చెప్పచ్చు.

నాలుగు వారాల్లోపే ఓటీటీకీ

ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెలలోగానే ఓటీటీలోకి వస్తుందని సమాచారం. డిసెంబర్ రెండో వారం (దాదాపు డిసెంబర్ 9వ తేదీన) అమేజాన్ ప్రైమ్ లో స్ర్టీమింగ్ లో ఉంటుందని చిత్ర వర్గాలు లీక్ ఇచ్చాయి. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లరైన యశోద నాలుగు వారాల్లోపే ఓటీటీకీ రాబోతుందని వార్త తెలియడంతో సామ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోస్తారు నుంచి పెద్ద సినిమాలు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీకి రావాలని నిర్మాతల మండలి ఇటీవల ఒక నిబంధన తెచ్చింది.

ఓటీటీ రైట్స్ రూ. 25 కోట్లకు

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన ‘యశోద’ మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ర్టీమింగ్ కావడం గమనార్హం. ఓటీటీ రైట్స్ రూ. 25 కోట్లకు అన్ని భాషలకు అమేజాన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తో పాటు ఇతర పాత్రదారులు అలరించారు. ఈ మూవీని హరి, హరీష్ ద్వయం డైరెక్ట్ చేయగా, శ్రీదేవి పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.