ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు షాక్‌ ఇచ్చిన నాగార్జున

0
201
Nagarjuna shocked the producers guild

సినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని మాంచి టైమింగ్‌లో చూసి విడుదల చేయడం మరొక ఎత్తు. తెలుగు సినిమాలకు సంక్రాంతికి మించిన మాంచి టైమింగ్‌ ఇంకేముంది.

తెలుగు వారికి సంక్రాంతి పండుగ అంటే కోడిపందాలు, భోగిమంటలు, అందాల లోగిళ్లు వీటితో పాటు కొత్త సినిమా కూడా కొన్ని దశాబ్దాల నుండి సంక్రాంతిలో ఒక భాగమై పోయాయి.

అందుకే సంక్రాంతి టార్గెట్‌గా అటు అగ్రహీరోల నుంచి ఇటు చిన్న హీరోల దాకా తమ సినిమాలను బరిలోకి నిలపటానికి నిర్మాతలను ప్రెషర్‌ చేస్తుంటారు.

సంక్రాంతి బరిలోకి దిగి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఇక ఆ సినిమాకు లాభాల పంట పండినట్లే.
అయితే మారిన సినిమా బిజినెస్‌కు అనుగుణంగా కొన్ని సంవత్సరాలుగా ఒకటి, రెండు పెద్ద సినిమాలు మొత్తం థియేటర్స్‌ను ఆక్రమించేస్తున్నాయి.

Salaar disaster in Nizam area RRR records in danger

మిగిలిన సినిమాలకు చోటు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అయితే ఆ నలుగురు ప్రొడ్యూసర్స్‌ కూర్చుని ఎవరి సినిమా ముందు వేయాలి, ఎవరి సినిమా తరువాత వేయాలి అన్నది డిసైడ్‌ చేసుకుని మిగిలిన సినిమాలకు మొండి చేయి చూపుతున్నారు.

ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ముందు నుంచీ కొంత వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బంగార్రాజు సినిమా విడుదల విషయంలో కూడా ఇలా నాగార్జునను సంక్రాంతి బరి నుంచి తప్పించాలని గిల్డ్‌ పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తికి నాగార్జున క్లాస్‌ పీకి పంపాడు.

తాజాగా ఈ సంక్రాంతి బరిలోకి నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ చిత్రం రానుంది. తొలుత ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే నాగార్జున మాత్రం సంక్రాంతి ఫ్లేవర్‌ ఉన్న సినిమా కాబట్టి పండక్కే వెయ్యాలని ప్రీపోన్‌ చేసి జనవరి 14న విడుదలకు ప్లాన్‌ చేశారు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద చిత్రాల నిర్మాతలతో కూడిన ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు షాక్‌ తగిలినట్టు అయింది.

ఈ చిత్రంలో నాగార్జున పక్కా మాస్‌ క్యారెక్టర్‌ చేయడం, దీనికి తోడు అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌తో కలిసి నాగార్జున నటిస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్‌ ఉంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా దూసుకు పోవడం ఖాయం.