బండ్ల గణేశ్-త్రివిక్రమ్ మధ్య మళ్లీ విభేదాలు

0
416

పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి బండ్ల గణేశ్. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ పై ఈగ కూడా వాలనివ్వరని టాక్ కూడా తెచ్చుకున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ వే ఉంటాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుసుకుంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమానే.

దీంతో పాటు మంచి సన్నిహితుడు, స్నేహితుడని కూడా తెలిసిందే. వీరి మధ్య ఏదో ఒక విషయంలో ఎప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకచ్చారు. అవి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ పరోక్ష విమర్శలు

పేరు చెప్పకుండా గురూజీ అంటూ సంబోదిస్తూ విమర్శలు చేయడం గమనార్హమే. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఆయన మాటల్లోనే విందాం.. ‘పవన్ కళ్యాణ్ లోని నిజమైన స్టార్ ను చూసించి మొదట నీనే. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు ఒక శక్తి అని నాకు ముందునుంచే తెలుసు. ఆయనలో విపరీతమైన టాలెంట్ ఉంది. అతీతమైన టాలెంట్ ను తన సినిమాల ద్వారా పవన్ కళ్యాన్ అభిమానులకు చూపించే అదృష్ణం నాకే కలిగింది.

ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు గురూజీలు, బరూజీలు తామే పవన్ కళ్యాణ్ ను స్టార్ చేశామని చెప్తున్నారు. వారి గురించి నాకు తెలియదు. వారిని పక్కనబెడితే నీను ఇప్పటికీ హీరోగా అభిమానించే వారిలో ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయనపై ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటాను. ఇలాంటి గురూజీలు నా మీద కృతజ్ఞత చూపించాలని నేను ఎప్పుడూ అనుకోను.’ అని చెప్పుకచ్చారు బండ్ల గణేశ్.

బండ్ల గణేశ్ ప్రాజెక్టుకు నో చెప్పిన పవన్ కళ్యాణ్

నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో వరుస సినిమాలు చేసిన బండ్ల గణేశ్. కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ ప్రొడక్షన్ కొనసాగించాలని అనుకొని తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయనకు బండ్ల గణేశ్ బ్యానర్ పై సినిమా చేయాలని ఉన్నా.. డేట్లు మాత్ర కుదరడం లేదు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ప్రారంభమైతే ప్రచారంలో పాల్గొనాలి.

ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను ఆఫ్టర్ ఎలక్షన్ కు పోస్ట్ పోన్ చేశారు ఆయన. ఇక కొత్త ప్రాజెక్టు అంటే కష్టమనే చెప్పాలి. కానీ ఇవన్నీ పట్టించుకోని బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ తనతో సినిమా చేయకుండా ఆపుతున్నది త్రివిక్రమే అన్న అనుమానం బాగా పెంచుకున్నారు. అందుకే త్రివిక్రమ్ పై పేరు చెప్పకుండా కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులైన బండ్ల గణేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విభేదాలు సృష్టించింది ఎవరు..? కావాలనే ఇలా చేశారా..? త్రివిక్రమ్ మాటలు వినే బండ్ల గణేశ్ ను పవన్ కళ్యాణ్ దూరం పెట్టారా..? అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా పవన్ అభిమానులైన వీరు పోట్లాడుకోకుండా కలిసే ఉండాలని కోరుకుంటున్నారు సాధారణ అభిమానులు.