నరేశ్ మూడో భార్యకు భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా

0
397

నవ్వుల రారాజుగా అనతికాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నారు సీనియర్ నటుడు నరేశ్. ఆయన జంధ్యాల కాంబినేషన్ లో చేసిన సినిమాలు ఇప్పటికీ సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయనడంలో సందేహమే లేదు. ఒక దశలో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు. మంచి హీరోగా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఈ మధ్య తరుచూ వివాదాల్లో నిలుస్తున్నారు. కెరీర్ పరంగా అంటే ఒకే అనుకోవాలి కానీ.. వ్యక్తిగత జీవితంలో ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఈ మధ్య సహనటి పవిత్రా లోకేశ్ తో ఆయన లివింగ్ రిలేషన్ షిప్ ఇండస్ట్రీలో తీవ్ర అలజడికి దారి తీసింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

గతంలో బెంగళూర్ లో ఒక రూమ్ లో పవిత్ర లోకేశ్ తో నరేశ్ ఉండడాన్ని నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఒక వీడియో కూడా చిత్రీకరించింది. దీన్ని మొదట్లో కొట్టిపారేసిన నరేశ్, పవిత్ర తర్వాత తాము లివింగ్ లో ఉన్నట్లు మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఆ తర్వాత కావాలనే రమ్య తమను వేధింపులకు గురి చేస్తుందని పవిత్ర మండిపడ్డారు. నరేశ్ భార్య చర్యలతో విసుగు చెందిన ఇద్దరూ పోలీసులను కూడా ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కొన్ని వెబ్ ఛానళ్లు, వెబ్ మీడియాపై నరేశ్, పవిత్ర కలిసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కేసు పెట్టారు. ఈ వివాదం పూర్తిగా కొలిక్కి వచ్చిందనే చెప్పాలి. ఇటీవల నరేశ్ వీరి లివింగ్ పై స్పందించారు. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. దీంతో రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ వివాదం లేవనెత్తింది.

విడాకుల అంశం ఫైనల్

2023 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నరేశ్, పవిత్ర లోకేశ్ అదర ఛుంబన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక మమ్ములను ఎవ్వరూ విడదీయలేరన్న సందేశాన్ని వీరిద్దరూ పంపారు. ఇవన్నీ పక్కన పెడితే నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇస్తున్నట్లు తెలిసింది. నరేశ్ కు అత్యంత సన్నిహితుడైన చిట్టిబాబు రమ్య రఘుపతి నరేశ్ విడాకుల విషయంపై స్పందించారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.

చిట్టిబాబు సంచలన విషయాలు

చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రమ్యతో నరేశ్ విడాకులు తీసుకుంటున్న విషయం కోర్టు పూర్తయిందని చెప్పారు. ఆమెకు భరణం కింద ఎంత చెల్లించాల్సి వచ్చినా చెల్లిస్తానని నరేశ్ కూడా ఒప్పుకున్నట్లు వివరించారు. నరేశ్ తల్లి విజయ నిర్మల ఆస్తులతో పాటు ఆయనకు కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కోట్లల్లో భరణం చెల్లించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక నరేశ్-రమ్య కొడుకుకు నరేశ్ తల్లి ఆస్తిలో వాటా ఉంటుందని, కానీ నరేశ్ ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదని చిట్టిబాబు చెప్పారు. ఈయన మాటలను పరిశీలిస్తే రమ్య రఘుపతి భారీగానే భరణం తీసుకుంటుందని తెలుస్తోంది.