‘అన్ స్టాపబుల్’కు పవన్ కళ్యాణ్..!

0
1460

ఆహా వేధికగా నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ తో దూసుకుపోతున్నారు. సీజన్ 1తో దుమ్ము రేపిన బాలకృష్ణ సీజన్ 2ను కూడా మరింత వైవిధ్యంగా తీర్చి దిద్దుతున్నారు. ఏ ఎపీసోడ్ కు ఏ గెస్ట్ ను పిలుస్తారో అనేది ఆడియన్స్ ఊహకు కూడా అందడం లేదు. దీంతో తర్వాత వీరు, వారు అంటూ వస్తున్న పుకార్లు షోను మరింత హైప్ చేస్తున్నాయి. సీజన్ 2 ప్రారంభ ఎపీసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేశ్ ను తీసుకచ్చారు బాలయ్య. తరువాతి ఎపీసోడ్ లో డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డను, విశ్వక్ సేన్, అడవి శేషు, శర్వానంద్ ను షోకు పిలిచి బాలయ్య రచ్చ చేశారు.

పొలిటికల్ కు వెళ్లిన బాలకృష్ణ

ఆ తర్వాత పొలిటికల్ కు వెళ్లిన బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, తార రాధికను ఇన్వైట్ చేశారు. మరో ఎపీసోడ్ లో ఇద్దరు నిర్మాతలైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును పిలిచారు. తనను, చిరంజీవిని పెట్టి ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ షోలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. అల్లు కూడా ఒకే చెప్పారు.

ఈ మేరకు హింట్ కూడా

ఇక లెటెస్ట్ ఎపీసోడ్ కు పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ రానున్నారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను కూడా ఆహా ఇటీవల విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు తెగ వైరల్ గా మారాయి. నెక్ట్స్ ఎపీసోడ్ లో పవన్ కళ్యాణ్ ను తీసుకస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు హింట్ కూడా ఇచ్చారు బాలయ్య. ఒక ఎపీసోడ్ లో త్రివిక్రమ్ కు కాల్ చేసి ‘ఎప్పుడు వస్తున్నారు షోకు.. ఎవరితో తెలుసుగా’ అంటూ మాట్లాడారు. సాధారణంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు కాబట్టి త్రివిక్రమ్ ను ఎవరితో రావాలని బాలయ్య సూచించారో ఫ్యాన్స్ గుర్తించే ఉంటారు.

మహేశ్ బాబుతో ఎండ్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎపీసోడ్ ను సంక్రాంతికి (జనవరి 14) టెలీకాస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి సీజన్ ఫస్ట్ ఎపీసోడ్లో నవంబర్ 4న ప్రసారమైతే.. చివరి ఎపీసోడ్ ఫిబ్రవరి 4న మహేశ్ బాబుతో ఎండ్ అయింది. ‘అన్ స్టాపబుల్ ఎన్‌బీకే 2’ సీజన్ 2 అక్టోబర్ 14న ప్రారంభమైంది (గత సీజన్ తో పోలిస్టే 20 రోజుల ముందు) కాబట్టి.. సీజన్ 2ను కూడా మరో 20 ముందుకు జరిపి జనవరి 14న ముగించనున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎపీసోడ్ లో పవన్ కళ్యాణ్ తో సందడి పూర్తవగానే సీజన్ 2 ముగుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇద్దరు లెజెండ్లు కలిసి సందడి

జనవరి 14 ఎపీసోడ్ లో పవన్ కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ లో సంక్రాంతి సందడి నిండుకుటుంది. షో బీభత్సవంగా ఉంటుంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే యమా థ్రిల్ ఉంటుంది. వీరి కాంబోలో గతంలో ఒక సినిమాను తీయాలనుకున్నారు. కానీ అది ముందుకు వెళ్లలేదు. ఓటీటీలోనైనా ఇద్దరు లెజెండ్లు కలిసి సందడి చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి అది ఫలిస్తుందని కలలు కంటున్నారు.