విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రివ్యూ

0
2038

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ దాదాపు 12 సంవత్సరాల తర్వాత థియేటర్లలో రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం (డిసెంబర్ 16న) 186 భాషల్లో సీనీ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అవతార్ 1 సమయంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ 12 సంవత్సరాల పాటు ఈ సినిమాను ఒక యజ్ఞంలా భావించి తీశాడు. అవతార్ 1 అప్పట్లో విజువల్ వండర్ గా నిలిచి ప్రేక్షకులను బాగా అలరించింది.

ఈ రోజుల్లోనే ఇది ఎలా తెరకెక్కించారు..? ఇంతటి టెక్నాలజీ ఎక్కడిది..? అంటూ అన్ని దేశాల చిత్ర పరిశ్రమలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి కూడా. అవతార్ 1 తెలుగు రాష్ర్టాల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. దీనికి ధీటుగా ఏ సినిమా కూడా ఆడలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి రికార్డులను తిరగరాసింది.

దీనికి సీక్వెల్ గా వచ్చిందే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. 3డీ (3D), ఐమాక్స్ (3D), 4డీఎక్స్ (4DX) ఫార్మాట్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆ మేరకు అందుకుంటుందా ఇక్కడ చూద్దాం..

స్టోరీ

పండోరా గ్రహంలోకి అడుగు పెట్టిన వ్యక్తి జేక్ సుల్లీ, అదే గ్రహానికి చెందిన నేత్రిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ వీరు కుటుంబాన్ని ఏర్పరుచుకొని సంతోషంగా ఉంటారు. కొత్తగా వచ్చిన జేక్ సుల్లీకి నేత్రి గ్రహంలోని వింతలు చూపిస్తూ అక్కడ జీవించేందుకు ఉపయోగపడే విద్యను నేర్పుతుంది. అయితే అక్కడి వనరులను దోచుకునేందుకు భూమి నుంచి కొందరు సైంటిస్టులు పండోరాకు వస్తారు.

మనుషులను అవతార్ కు కనెక్ట్ చేసి అక్కడి జాతి ఆధీనంలోని విలువైన సంపదను కొల్లగొట్టాలని చూస్తారు. భూమి కేంద్రంగా ఒక మిషన్ పై వెళ్లిన వీరిని స్థానికంగా ఉండేవారు అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలో వారి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇందులో పండోరా గ్రహ వాసులు విజయం సాధిస్తారు ఫస్ట్ పార్టులో చూశాం.

ఇక ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ లో అక్కడే ఉన్న జేక్ సుల్లీ, నేత్రి మరో యుద్ధం చేయాల్సి వస్తుంది. పండోరా నుంచి వెళ్లిన వారిలో కొందరు మళ్లీ వస్తారు. పండోరా గ్రహస్తులతో మరో మారు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం ప్రధానంగా వాటర్ లో ఉంటుంది. కాబట్టి దీనికి ది వే ఆఫ్ వాటర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు కేమరూన్. సముద్రంలో ఉండే వింత జీవులతో సహవాసం.. వాటిని కలుపుకుంటూ చేసే యుద్ధం.. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది థియేటర్లలో చూడాల్సిందే..

విశ్లేషణ

అవతార్ ఒక వండరైతే.. అవతార్: ది వే ఆఫ్ వాటర్ అందుకు పదింతలనే చెప్పాలి. ప్రేక్షకులను ఆ మేరకు కుర్చీల నుంచి కదలనివ్వదనడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా 3డీలో చూసిన ప్రతి ఒక్కరికీ మరింత థ్రిల్ ఇస్తుంది. మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా అన్న అనుభూతి వస్తుంది.

సినిమాలో ఎమోషన్ విషయంలో మనిషి జాన్ సుల్లీ, ఏలియన్ నేత్రి మధ్య జరిగిన లవ్ ట్రాక్ మనసుకు హత్తుకుంటుంది. మొదటి పార్టు విజువల్ అయితే రెండో పార్టులో ఎమోషన్ స్థానం కల్పించాడు దర్శకుడు. యుద్ధం, శాంతి నెలకొనడం లాంటి సన్నివేశాలతో కథను బాగా తెరకెక్కించారు. తెలుగు వర్షన్ కు సంబంధించి అవసరాల శ్రీనివాస్ అవతార్ 2కు మాటలు అందించారు.

ఇందులో తెలుగు నేటివిటీకి దగ్గరయ్యేలా ఉన్న డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రధానంగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పకోక తప్పదు. ‘మారో ఫియారే’ కెమెరా పనితనం ఇక్కడ అద్భుతంగా నిలిచింది. కెమెరాతో ఆయన చేసిన అద్భుతాలను మనం మూవీలో చూడొచ్చు. జేమ్స్ హానర్ మ్యూజిక్ ఆహ్లాదంగా, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ‘మేస్ర్టో జో లెట్టెరీ’ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.

చివరగా

అవతార్ రెండు పార్టులు కూడా విజువల్ వండరే.. కానీ అవతార్ 2 అవతార్ కన్నా పదిరేట్ల విజువల్ వండర్ తో వచ్చింది. ఇలాంటి సినిమాలను 3డీ, 4డీఎక్స్ లాంటి థియేటర్లలో చూస్తేనే ఆ థ్రిల్ ను ఫీలవగలం. కనీసం థియేటర్లలో చూస్తేనైనా మంచి ఫీల్ వస్తుంది. కానీ టీవీలో మాత్రం అంత థ్రిల్ అనిపించదు. మొదటి సారి తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. టికెట్ కు పెట్టిన ప్రతీ పైసా కంటే ఎక్కువే అనుభూమితిని ఇస్తుంది ఈ మూవీ..

నటీ నటులు:

సామ్ వర్థింగ్టన్, జో సల్దానా, జోయల్, స్టెఫాన్ ల్యాంగ్, డేవిడ్ మోర్, దిలీప్ రావు, తదితరులు

రచన, నిర్మాణం, దర్శకత్వం: జేమ్స్ కేమరూన్.
మ్యూజిక్: జేమ్స్ హార్నర్
సినిమటో గ్రఫీ: మారో ఫియోర్
ఎడిటర్స్: స్టెఫాన్ రివ్కిన్, జాన్ రెఫూనా, జేమ్స్ కామెరూన్.
బ్యానర్: లైట్ స్ర్టామ్ ఎంటర్ టైన్ మెంట్, డ్యూన్ ఎంటర్ టైన్ మెంట్
డిస్ర్టిబ్యూటర్: 20త్ సెంచరీ స్టూడియోస్

రేటింగ్: 4/5