బాలీవుడ్ క్రిటిక్స్ ని చెప్పుతో కొట్టాలి అంటూ ‘ఎనిమల్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్.

0
383
Animal producer's shocking comments saying that Bollywood critics should be slapped

ప్రపంచం మొత్తం ఇప్పుడు మన తెలుగు సినిమా సత్తా గురించి మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. రాజమౌళి కారణంగా మన తెలుగు సినిమా వైపు మిగతా భాషలకు సంబంధించిన వాళ్ళు చూడడం మొదలు పెట్టారు.

అలా కొంతమంది డైరెక్టర్స్ కి పాన్ ఇండియన్ సినిమాలు తీసే అవకాశాలు దక్కింది, మరికొంతమంది దర్శకులకు అయితే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు తీసే ఛాన్స్ దొరికింది.

అలా బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ అనే చిత్రం ద్వారా సంచలన విజయం అందుకొని తన సత్తా ఏంటో చూపించాడు డైరెక్టర్ సందీప్ వంగ.

ఈ సినిమా తర్వాత ఆయన రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే చిత్రాన్ని చేసి రీసెంట్ గానే విడుదల చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Allu Arjun as the number 1 hero of 2023 Telugu made history

సెన్సార్ బోర్డు వార్జు ‘A’ రేటింగ్ ఇచ్చినా కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అయితే సందీప్ వంగ సక్సెస్ ని చూసి బాలీవుడ్ క్రిటిక్స్ కుళ్ళుకుంటున్నారని ఆయన సోదరుడు, మరియు ఎనిమల్ నిర్మాతలలో ఒకడు ప్రణయ్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘సందీప్ వంగ బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ చిత్రం తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం చాలా మంది బాలీవుడ్ క్రిటిక్స్ కి నచ్చలేదు.

ఒక సౌత్ కి సంబంధించిన కుర్రాడు ఇక్కడ సక్సెస్ అవ్వడం ఏంటి అని విడుదల రోజు మొదటి ఆట నుండే నెగటివ్ రివ్యూస్ మరియు రేటింగ్స్ ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఏమి చేయగలిగారు ?, ‘ఎనిమల్’ సునామి ని ఆపగలిగారా?, లేదు కదా,

వాళ్లకి నేను సందీప్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు, అది చాలు’ అంటూ ప్రణయ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అతను చేసిన కామెంట్స్ పై మన టాలీవుడ్ నెటిజెన్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తలపొగరు తో మదం ఎక్కినా బాలీవుడ్ గాళ్ళకు ఇలాగే సమాధానం ఇవ్వాలి,

శబాష్ సందీప్ వంగ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత వెంటనే సందీప్ వంగ ‘ఎనిమల్’ సీక్వెల్ ‘ఎనిమల్ పార్క్’ ని చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి అయ్యాక ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తాడు.