ఆ ఒక్క ట్యూన్‌ రెహ్మాన్‌ లైఫ్‌ టర్న్‌ చేసింది..

0
228
ar Rahman favorite tune

మనం ఎంత కష్టపడి ఏం లాభం అదృష్టం ఉండాలి అంటారు కొందరు. మనకు ఎంత అదృష్ఠం ఉండి ఏం లాభం.. అవకాశాలు రావాలి కదా అంటారు ఇంకొందరు. వీరిద్దరికీ భిన్నమైన మనుషులు మాత్రం వచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని ఒకేసారి ఒడిసి పట్టుకుని క్షణాల్లో సక్సెస్‌ను ఎగరేసుకుపోతారు.

అలాంటి అద్భుతమైన క్షణాల్లో చేసిన ఓ ట్యూన్‌ సంగీత సంచలనం రెహ్మాన్‌ జీవితాన్ని ఆస్కార్‌కు చేర్చింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘రోజా’తో రెహ్మాన్‌ సంగీత దర్శకుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

ar Rahman favorite tune

‘యాత్ర 2 ‘ ఫస్ట్ లుక్ పోస్టర్

దీనికి ముందు రెహ్మాన్‌ కీబోర్డ్‌ ప్లేయర్‌గా ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫంక్షన్స్‌లో జరిగే మ్యూజికల్‌ నైట్స్‌లో పాల్గొనేవాడు. ఒకసారి మణిరత్నం బొంబాయిలో జరిగిన ఒక ఫంక్షన్‌కు అటెండ్‌ అయ్యారు. అక్కడ రెహ్మాన్‌ కీబోర్డ్‌ వాయించడాన్ని చూశారు.

ఫంక్షన్‌ అనంతరం రెహ్మాన్‌ ఎదురుపడగా, మణిసార్‌ అతనికి తన విజిటింగ్‌ కార్డు ఇచ్చి ఒకసారి కలువు అన్నారు. అప్పటికే మణిరత్నం గారి పేరు దక్షిణాదిన మారుమోగుతోంది.

తమిళవాడు అయిన రెహ్మాన్‌ కూడా మణిసార్‌కు అభిమాని కావడంతో ఆనందంతో సరే అన్నాడు.
మరుసటిరోజు మధ్యాహ్నం రెహ్మాన్‌ మణిసార్‌ ఇంటిముందు నిలబడి ఉన్నాడు. ఎందుకో పోర్టికోలోకి వచ్చిన మణిసార్‌ గేటు బయట నిలబడ్డ ఇతన్ని గుర్తుపట్టి లోపలకు రమ్మన్నారు.

రెహ్మాన్‌ వివరాలు తెలుసుకుని, మంచి ట్యూన్‌ ఏదైనా చేసి తీసుకురా చూద్దాం అన్నారు. రెహ్మాన్‌ తలూపి వెళ్లిపోయాడు. రాత్రి 7 గంటలకు పనిమీద బయటకు వెళ్లడానికి బయలుదేరారు మణిసార్‌. గేటు దగ్గర రెహ్మాన్‌ నిలబడి ఉన్నాడు.

దగ్గరకు పిలిచి మధ్యాహ్నమే కదా కలిశావు మళ్లీ ఏంటి? అన్నారట కొంత అసహనంగా. దానికి రెహ్మాన్‌ ట్యూన్‌ చేశాను సార్‌ అంటూ ఆడియో క్యాసెట్‌ ఒకటి ఆయన చేతిలో పెట్టాడట.

ఇంకా సుహాసిని గారు కిందికి రాకపోవడంతో కారు దగ్గర ఎదురు చూస్తున్న ఆయన క్యాసెట్‌ను కారులోని స్టీరియోలో పెట్టి ఆన్‌ చేశారట. ట్యూన్‌ వింటున్న మణిసార్‌ మొహంలో క్రమ క్రమంగా సంతోషం పొంగుకొస్తోంది. చివరిగా ఎగిరి గంతేసినంత పని చేశారట.

ఈ ట్యూన్‌ ఈరోజు చేసిందేనా అన్నారు. రెహ్మాన్‌ అవును అనగానే అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారట. ఆ ట్యూన్‌ మరేదో కాదు ‘‘చిన్ని చిన్ని ఆశ’’ పాట.

ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే ‘‘ఏలేలో.. ఏలో ఏలేలో.. ఏలేలో.. ఏలో ఏలేలో.. ఏలేలేలేలో.. ఏలేలో’’ అనే కోరస్‌ మణిరత్నాన్ని మంత్రముగ్ధుణ్ణి చేసిందట. అలా ఆ ట్యూన్‌ రెహ్మాన్‌ లైఫ్‌ను టర్న్‌ చేసిందన్నమాట.