‘యాత్ర 2 ‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్

0
439
yathra 2 movie

2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ కి కలిసి వచ్చేలా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని చేసిన ‘యాత్ర’ మూవీ ని విడుదల చేసారు. ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్మూటీ రాజశేఖర్ రెడ్డి పాత్ర ని పోషించాడు.

ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, వైసీపీ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కింది. ఇది వై ఎస్ జగన్ బియోపిక్. ఇందులో జగన్ పాత్రని ప్రముఖ తమిళ హీరో జీవా చేస్తున్నాడు.

షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వై ఎస్ జగన్ గా జీవా బాగా సెట్ అయ్యాడని కామెంట్స్ కూడా వినిపించాయి.

yathra 2 movie

మిరాజ్‌, పీవీఆర్‌లతో ‘సలార్‌’ పంచాయితీ

రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలు, ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి వైసీపీ పార్టీ ని స్థాపించడం. రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టడం, ఇత్యాది సంఘటనలను ఆధారంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించాడట డైరెక్టర్ మహి పీ రాఘవ్.

వైసీపీ ప్రస్థానం జగన్ ని ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎలా కొనసాగింది, మధ్యలో ఎన్ని ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, దానిని జగన్ ఎలా ఎదురుకున్నాడు అనేవి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట.

చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పాత్రలు కూడా ఇందులో ఉంటాయట. ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోవడం, రాబొయ్యే ఎన్నికలకు సిద్ధం అవ్వడం వరకు సినిమాని చూపిస్తారని టాక్. ‘యాత్ర’ సినిమా కంటెంట్ చూసేందుకు చాలా ఎమోషనల్ గా అనిపించింది.

సినిమాలో దమ్ము ఉంది కాబట్టే ఆ రేంజ్ లో హిట్ అయ్యింది. అప్పట్లోనే ఈ చిత్రం దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట. మహి పీ రాఘవ్ లో విషయం ఉంది కాబట్టి, ఈ యాత్ర 2 ని కూడా అదే రేంజ్ లో తీసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే వైసీపీ కి ప్రస్తుతం ఉన్న నెగటివిటీ లో కాస్త సహాయ పడినట్టు అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో అనేది.