మీరొక అద్భుతాన్ని రాయబోతున్నారు అంతే

0
272
aa naluguru movie

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’ సినిమాల్లో ఓ డైలాగ్‌ ఉంటుంది ‘‘అద్భుతాలు జరిగే ముందు ఎవరికీ తెలియదు.. అది జరిగిన తర్వాత ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు’’ అని. నిజంగా అలాంటి అద్భుతాన్ని సృష్టించిన సినిమా ‘ఆ నలుగురు’.

మంచి మెసేజ్‌తో కూడిన చక్కని చిత్రం. ప్రేమ్‌ మూవీస్‌ పతాకంపై చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో సరిత పాట్రా, ప్రేమ్‌కుమార్‌ పాట్రా నిర్మించిన ఈ చిత్రానికి కథ దివంగత రచయిత, దర్శకుడు మదన్‌. 2004లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది.

ముఖ్యంగా ఇందులోని ‘‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం’’ పాట సినిమా విజయంలో సింహభాగాన్ని ఎగరేసుకుపోయింది. ఈ పాట వెనకాల ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సందర్భానుసారం రాజేంద్రప్రసాద్‌ పాత్ర చనిపోతుంది. ఆయన అంతిమయాత్రలో ఈ పాట రావాలి.

aa naluguru movie

‘యాత్ర 2 ‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్

అది శవయాత్రే అయినా.. ఆ పాటలో అతని గొప్పదనాన్ని చెప్పలి. అతని కోసం సమాజం పడే తపన చెప్పాలి. జీవిత సత్యాలు కూడా ఉండాలి. రొటీన్‌ చావు పాటల్లా కాకుండా అతను చనిపోయాడు అనే భావన ప్రేక్షకుల్లో వీలైనంత వరకూ రాకూడదు అని పాటల రచయిత చైతన్య ప్రసాద్‌కు చెప్పారు.

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సూపర్‌ ట్యూన్‌ ఇచ్చాడు. దర్శకుడు చంద్ర సిద్దార్థ చెప్పినదాంట్లో తనకు అర్ధమైనది తీసుకుని చైతన్య ప్రసాద్‌ రెండు, మూడు వెర్షన్స్‌ రాశారు. కానీ చంద్ర సిద్దార్థకు నచ్చడం లేదు. మరో నాలుగు రాశారు అయినా నచ్చలేదు.

ఓరోజు చైతన్య ప్రసాద్‌ ‘‘సార్‌.. ఇక ఈ పాట రాయడం నా వల్ల కాదేమో. ఇంకెవరికైనా అప్పగించండి’’ అన్నారు. దానికి చంద్ర సిద్దార్థ ‘‘లేదండి ఎన్ని వెర్షన్స్‌ అయినా పర్వాలేదు. మీరొక అద్భుతాన్ని రాయబోతున్నారు. నేను చెప్తున్నానుగా’’ అంటూ ప్రోత్సహించారు.

మొత్తానికి 16వ వెర్షన్‌లో అందరికీ నచ్చే పదాలతో ఆంధ్రదేశాన్ని ఊపేసిన ‘‘ఒక్కడై రావడం..’’ సాంగ్‌ వచ్చింది. దీన్ని బాలు తనదైన అమృతమైన కంఠంతో ఆలపించడం విశేషం.

ఇందులోని ‘‘వెంట ఏ బంధమూ.. రక్త సంబంధమూ తోడుగా రావుగా తుది వేళ’’… ‘‘కోట్ల ఐశ్వర్యము.. కఠిక దారిద్య్రము హద్దులే చెరిపెనే మరుభూమి’’… ‘‘రాజనీ, పేదనీ.. మంచనీ.. చెడ్డనీ బేధమే ఎరుగదే యమపాశం’’… ‘‘బ్రతికిననాడు బాసటగా.. పోయిన నాడు ఊరటగా.. నీ బరువు, నీ పరువు మోసేదీ.. ఆ నలుగురు’’ వంటి కొన్ని పదాలు ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే ఈ పాట టీవీల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.