నన్ను మోసం చేసారు.. శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

0
295
hero naga chithanya sriram

ఒకప్పుడు తమిళం లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో శ్రీరామ్. తెలుగు లో ఇతను ‘రోజా పూలు’ అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అటు కమర్షియల్ గా మంచి హిట్ అవ్వడమే కాకుండా, శ్రీరామ్ కి మంచి పేరుని తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత ఆయనకీ హీరో గా పెద్దగా హిట్స్ రాకపోయినా క్యారక్టర్ ఆరిస్టుగా మాత్రం మంచి పేరు వచ్చింది. సౌత్ లో ఉన్న పెద్ద హీరోలందరితో దాదాపుగా కలిసి నటించిన శ్రీరామ్ ఇప్పటికీ హీరోగా అప్పుడప్పుడు వెండితెర మీద మెరుస్తున్నాడు.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన చిత్రం ‘పిండం’ రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

hero naga chithanya sriram

పవన్‌ కల్యాణ్‌ నిర్మాత అయితే నాకేంటి?

గతం లో శ్రీరామ్ అక్కినేని నాగ చైతన్య తో కలిసి ‘దడ’ అనే చిత్రం చేసాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక సంఘటన గురించి చెప్తూ ‘గతం లో నేను నేను నాగ చైతన్య తో కలిసి దడ చిత్రం చేశాను.

ఇందులో ఎత్తైన బిల్డింగ్ నుండి మరో బిల్డింగ్ పైకి దూకే షాట్ ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశం కోసం నేను 28 టేకులు తీసుకున్నాను. ఎలాంటి రోప్స్ వాడకుండా అంత ఎతైన బిల్డింగ్ మీద నుండి దూకాను. మధ్యలో ఏదైనా తేడా జరిగి ఉంది రోడ్ మీద పడిపోయి నా శరీరం నుజ్జునుజ్జు అయ్యేది.

అంత పెద్ద రిస్కీ షాట్ చేస్తే చివరికి ఆ సన్నివేశం ని సినిమాలో పెట్టలేదు. చాలా బాధ అనిపించింది. కష్టానికి తగ్గ విలువ లేకపోవడం తెలుగు లో మళ్ళీ క్యారక్టర్ రోల్స్ చెయ్యకూడదు అనేంత కోపం వచ్చింది’ అంటూ శ్రీ రామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే పిండం చిత్రం ఈ నెల 15 వ తారీఖున విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.