పవన్‌ కల్యాణ్‌ నిర్మాత అయితే నాకేంటి?

0
431
pawan kalyan subhasri

నేను ఈ సినిమా చేయను అన్నది.. అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే ఆర్టిస్ట్‌ల పనీ.. అని పాడుకోవాల్సి వస్తుంది. అనుకోకుండా ఒక్కోసారి మనం ఊహించని ఆఫర్స్‌ వస్తుంటాయి.. అంతే వేగంగా ఒక్కోసారి మన ఊహకు కూడా అందకుండా చేజారి పోతుంటాయి. వాటంతట అవి చేజారిపోతే సరి.. కానీ మనంతట మనం చేజార్చుకుంటే మాత్రం మన ఖర్మ.

అలాంటి ఓ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంది జబర్‌దస్త్‌ ఫేం నటి సత్యశ్రీ. ఈటీవీలో ప్రసారమయ్యే సూపర్‌హిట్‌ షో జబర్‌దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి సత్యశ్రీ. ఓవైపు బుల్లితెరపై తన సత్తా చాటుకుంటూనే వెండితెరపై వెలిగిపోవాలని కూడా ప్రయత్నించింది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ హీరో, నిర్మాతగా రూపొందిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో ఓ పాత్రకు ఆమెను సెలక్ట్‌ చేసుకున్నారు.

pawan kalyan subhasri

ఉచితంగా ప్రభాస్ ‘సలార్’ టిక్కెట్లు

రెమ్యునరేషన్‌, డేట్స్‌ కూడా మాట్లేడేసుకున్నారు. ఇక షూటింగ్‌కు అటెండ్‌ అవ్వాల్సిన రోజు రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంగా సెట్స్‌కు వెళ్లిన సత్యశ్రీకి అక్కడ జరుగుతున్నది చూసి భయం వేసింది. అంతే వెంటనే తాను నటించనని వెళ్లిపోతానని కో`డైరెక్టర్‌కు చెప్పింది. ఆయన ఇది పవన్‌ గారు నిర్మాతగా తీస్తున్న సినిమా ఒక్కసారి ఆలోచించుకోండి అన్నారట.

దానికి ఆమె ‘‘పవన్‌ కల్యాణ్‌ గారు నిర్మాత అయితే నాకేంటి నేను ఈ సినిమా చేయను’’ అంటూ వెనుతిరిగి వచ్చేసిందట. విషయం తెలిసిన పవన్‌గారు మళ్లీ ఆమెను మరుసటిరోజు పిలిపించారట. ఎందుకలా డ్రాప్‌ అయ్యారు. మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అన్నారట. దానికి ఆమె మీ ప్రొడక్షన్‌ నుంచి ఏం ఇబ్బంది లేదు. నాకు ఈ క్లబ్‌డాన్స్‌, ఈ సెట్‌ వాతావరణం చూస్తుంటే భయం వేసింది అందుకే చేయను అన్నాను అందట.

దానికి పవన్‌ నవ్వుకుని ఓకే మీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నారట. వెళ్లేముందు పవన్‌తో ఓ సెల్ఫీ అడిగిన సత్యశ్రీకి ఆయన సంతోషంగా సెల్ఫీ ఇచ్చారట. ఇలా జరగడం ఓవైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు పవన్‌ గారి సినిమా వదులుకున్నందుకు బాధగా కూడా ఉంది అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.