అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన అడవి శేషు

0
242

విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకోవడంతో పాటు పాత్రకు తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారు అడవి శేషు. ఆయన చేసిన ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ స్టయిల్ లో సాగుతుంది. కర్మ, క్షణం, ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా ప్రతీ సినిమాలో ఆయన పాత్ర డిఫరంటనే చెప్పాలి. కర్మ సినిమాలో ఆయన నటనను చూసిన చాలా మంది అభిమానులుగా మారిపోగా, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకున్నారు అడవి శేషు. ఇక ఇన్వెస్టిగేషన్ కోణంలో వచ్చిన ఎవరు..? కూడా బాగా ఆకట్టుకుంది. ప్రతీ చిత్రంలో ఒక డిఫరెంట్ పాత్రను ఎంచుకుంటారు అడవి శేషు.

ప్రతీ కథ కొత్తగా

కథ ఎంపికలో అడవి శేషు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన ఉన్నరంటేనే ఆ సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుంది. ఇటీవల ఆయన చేసిన హిట్ 2 కూడా బాగానే ఆడింది. దీంతో ఆయనకు ఇండస్ట్రీలో వెయిట్ పెరిగింది. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా పెంచారని తెలుస్తోంది. కొన్ని సినిమాలకు కథలు కూడా అందించారు అడవి శేషు.

బ్రాండ్ అంబాసిడర్ గా

ఈ యంగ్ స్టార్ ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారట. దీనికి సంబంధించి ఇటీవల సైన్ కూడా చేశారట. అందుకు గానూ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతంటే ఏకంగా రూ. 50 లక్షలు. దీంతో ప్రస్తుతం ఉన్న కొంత మంది యంగ్ స్టార్ల సరసన ఆయన కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సినిమాలకు కూడా ఆయన తీసుకునే పారితోషికాన్ని అమాంతం పెంచేశారట.

కొనసాగుతున్న ‘అడవి’ హవా

ప్రస్తుతం అడవి శేషు హవా కొనసాగుతుంది. ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ కావడంతో ఆయనకు మార్కె్ట్ కూడా బాగానే పలుకుతుంది. దీంతో ఆయన తన సినిమాకు గతంలో తీసుకుంటున్న రెమ్యునరేషన్ ను పెంచేశారు. అది కూడా భారీగానే.. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ. 12 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఇటు బ్రాండ్ అంబాసిడర్ గా, అటు సినిమాలలో ఈ ఏడాది అడవి శేషు బాగానే సంపాదిస్తున్నారని చెప్పాలి. ఆయనకు 2022 కలిసి వచ్చిందనంలో ఎలాంటి సందేహం లేదు మరి.

హిట్ 2తో దూసుకుపోతున్న శేషు

ఇటీవల న్యాచురల్ స్టార్ సొంత బ్యానర్ పై వచ్చిన హిట్: ది సెకండ్ కేస్ వచ్చింది. ఇందులో అడవి శేషు హీరోగా చేశారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారిగా ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రెమ్యునరేషన్ పెంచాన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.