యంగ్ టైగర్ కు అంతసీన్ లేదని కొట్టి పారేసిందట..!

0
214

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మొదట్లో ఆ బ్యాగ్రౌండ్ ఆయనకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఇక తప్పదనుకున్న ఆయన స్వయంకృషితో ఎదగడం మొదలుపెట్టాడు. నందమూరి హరికృష్ణ కొడుకుగా తాత రాజసం, నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనుమడిగా రాణిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళితో తన రెండో సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ చేసి బాక్సాఫీస్ హిట్ ఇచ్చి స్టార్ డమ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ చిత్రం రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కు బాగా కలిసి వచ్చింది.

యమదొంగతో మళ్లీ కుదిరిన కాంబో

స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఎన్టీఆర్ కొన్ని ఫ్లాపులను ఎదుర్కొన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులు ఇష్టపడడం అప్ కమింగ్ హీరోలతో రాణించాలంటే మరింత తగ్గించాలని రాజమౌళి సూచించడంతో ఆయన దానిపై ప్రధానంగా దృష్టిపెట్టారు. దాదాపు 20 కిలోల వరకూ తగ్గి న్యూలుక్ తో వచ్చారు. దీంతో యంగ్ టైగర్ తోనే రాజమౌళి మరో చిత్రం ‘యమదొంగ’ తీశారు. ఇది బాక్సాఫీస్ హిట్టయ్యింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ తో మరింత క్రేజ్

ఇక వీరి కాంబోలో వచ్చిన పాన్ వరల్డ్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఇందులో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ స్ర్కీన్ ను పంచుకున్నారు. కానీ ఎక్కువ నిడివి ఎన్టీఆరే కనిపించారు. ఎన్నో హాలీవుడ్ అవార్డులను సొంతం చేసుకుంటున్న ఈ సినిమాను ఆస్కార్ బరిలో నిలపాలని దర్శక ధీరుడు మరిన్ని ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏదైనా కేటగిరీ నుంచి ఎన్టీఆర్ పేరు నామినేట్ అవుతుందని కొందరు భావిస్తున్నారు కూడా.

పట్టాలెక్కడంలో ఆలస్యం

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి ఒక ప్రాజెక్టులో చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం దర్శకుడు శివ ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో చిత్రం చేయనున్నారట ఎన్టీఆర్. ఈ విషయాలను పక్కన పెడితే.. ఎన్టీఆర్ తో నటించిన ఓ నటి ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేసింది అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఎవరా నటి అంటే పాయల్ గోష్.

అప్పుడే చెప్పిన పాయల్ గోష్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, తమన్న భాటియా హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా పాయల్ గోష్ నటించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ పై వస్తున్న కామెంట్లను చూసిన ఆమె స్పందించారట. ఎన్టీఆర్ ఎప్పటికైనా గ్లోబల్ స్టార్ అవుతాడని అప్పుడే జోస్యం చెప్పిందట. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అందుకు వేధికగా మారింది. పాన్ ఇండియాతో పాటే ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. నేను చెప్పింది అక్షరాలా జరిగింది అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఆమె ట్వీట్ కు యంగ్ టైగర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.