ఆ సాంగ్ తో కొట్టుకుపోయిన ‘వీరసింహా రెడ్డి’ హైప్

0
320

టాలీవుడ్ ఇండస్ర్టీలో సినియర్ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉంటారు బాలక్రిష్ణ. ఆయనను తన అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ స్లోగన్ రూపంలో పిలుస్తూ అభిమానం చాటుకుంటారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ చిత్రంలో ఒక సాంగ్ ను ఇటీవల (నవంబర్ 25)న చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ సాంగ్ పై ఆయన అభిమానుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బెడిసికొట్టిన ప్రయోగం

ఇటీవల ప్రతీ మూవీలో ప్రమోషన్ సాంగ్ ఉండేట్లు మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఒక పాట పెట్టాలని అనుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. బాలయ్య బాబు ఫ్యాన్ ను ఆయనను స్లోగన్ రూపంలో పిలచే ‘జై బాలయ్య’ టైటిల్ తో ఒక సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట చిత్ర ప్రమోషన్ కు పెంచకపోగా బాగా తగ్గిస్తుందని నెటిజన్ల నుంచి, ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అఖండ మూవీకి కూడా ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. అందులో ‘యా యా యా యా జై బాలయ్య’ అనే పాట ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అదే విధంగా ‘వీరసింహారెడ్డి’లో కూడా ‘జై బాలయ్య’ అంతటి క్రేజ్ క్రియేట్ చేస్తుందని తమన్ భావించాడు. కానీ ఆప్రయోగం బెడిసికొట్టి నెగిటివ్ టాక్ ను తెచ్చిపెట్టింది.

ఇదే టైటిల్ తో బాలయ్య చిత్రం

బాలక్రిష్ణ డై హార్డ్ ఫ్యాన్స్ ఆయనను ప్రేమగా స్లోగన్ రూపంలో ‘జై బాలయ్య’ అంటుంటారు. ఇదే టైటిల్ తో ఓ సినిమా కూడా చేయాలని బాలక్రిష్ణ ఎన్నో రోజులుగా అనుకుంటున్నారట. బహూషా డైరెక్టర్ అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్టు పేరు కూడా అదే కావచ్చని టాక్ వినిపిస్తుంది. ఇదే టైటిల్ తో అఖండలో వచ్చిన సాంగ్ కమర్షియల్ గా మంచి హిట్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో బాలయ్య స్టెప్పులు ఆయన అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సాంగ్ ఇప్పటికీ మంచి క్రేజ్ లో కొనసాగుతోంది.

రామజోగయ్య టార్గెట్ గా

‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ లో రిలీజైన ఈ సాంగ్ సినిమాకు నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకస్తుందని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. హీరో పేరు వీరసింహారెడ్డి అయినప్పుడు ‘జై బాలయ్య’ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మూవీతో సింక్ లేకుండా ప్రైవేట్ ఆల్బంలాగా చిత్రించారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు తమన్ ట్యూన్ కూడా ‘ఒసేయ్ రాములమ్మ’ నుంచి కొట్టేసినట్లుంది అంటూ పాటతో వీడియో ఎడిటింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ సాంగ్ రాసిన రామ జోగయ్య శాస్ర్తిపై కూడా సెటైర్లు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా రాస్తా

ఇంతటి స్టార్ హీరోకు రాయాల్సిన పాట కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ జోగయ్య హర్ట్ అయ్యే కామెంట్లు పెడుతున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ తను ప్రతీ పాట ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా రాస్తానని రీకామెంట్ చేస్తున్నారు. బాలయ్య ప్రోమో, లుక్స్ సినిమాకు హైప్ తెచ్చిపెట్టినా సాంగ్ మాత్రం దాన్ని పాడుచేసేలా ఉందంటూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.