ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు.. స్పందించిన నిర్మాత

0
554

పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్. ఆయన ఒక్కో మూవీకి దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకూ ప్రభాస్ కు ఒక్క రెమ్యునరేషన్ పరంగానే రూ. 500 కోట్ల వరకూ దక్కినట్లు సమాచారం. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ జూబ్లీహిల్స్ లో స్థలం కొన్నారట అది కూడా ఎంతకో తెలుసా.. అయితే ఆయనపై వచ్చిన ఈ కామెంట్ కు ఒక నిర్మాత కూడా స్పందించాడు. అసలేమన్నారో చూద్దాం..

ఇంగ్లిష్ వెబ్ సైట్ కథనం

ప్రభాష్ ఈ మధ్య కాలంలో జూబ్లీహిల్స్ లో ఒక ప్లాట్ కొన్నాడట. దీనికి సంబంధించిన కథనాన్ని ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ ఇటీవల ప్రచురించింది. దానికి కేవలం ప్రభాస్ రూ. 1.5 కోట్లకే దక్కించుకున్నట్లు కూడా పేర్కొంది. జూబ్లీహిల్స్ లో ఇంత తక్కువకు ప్లాట్ ఏంటి..? అక్కడ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే అక్కడ ఉన్న ఫామ్ హౌజ్ విలువ దాదాపు రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది.

నిర్మాత శోభు యార్లగడ్డ కామెంట్

ఇంగ్లిష్ వెబ్ సైట్ కథనానికి ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. అసలు ఏ ఆధారాలతో ఈ కథనం ప్రచురించారో అర్థం కావడం లేదు. జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు అంటే మాటలు కాదు. అక్కడ ఎకరం విలువ ఎంత ఉంటుందో తెలుసా.. అని వెబ్ సైట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. ఇలాంటి వార్తలు ప్రచురించి సెలబ్రెటీలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు. కథనం ప్రచురిస్తే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. కానీ పూర్తిగా అవగాహన లేకుండా ప్రచురించడం ఏంటి..? అని ప్రశ్నించాడు. దీనిపై సదరు వెబ్ సైట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇలాంటి వార్తలకు ప్రభాస్ కూడా పెద్దగా పట్టించుకోరు.

వరుస చిత్రాలతో ప్రభాస్ బిజీ

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఆయన చిన్నాన్న కృష్ణంరాజు ఇటీవల మరణించడంతో షూటింగ్ లో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్లీ చిత్రాలు సెట్స్ పైకి తీసుకెళ్లి నటనను కొనసాగిస్తున్నారు ప్రభాస్. ఆదిపురుష్ ట్రైలర్ ఇటీవల విడదల కావడంతో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దీంతో చిత్రాన్ని వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తదితర విభాలల్లో మార్పు చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక సలార్ విషయానికి వస్తే వేగంగా షూటింగ్ సాగుతోంది.

ఇది కూడా సెట్స్ పై

ఏది ఏమైనా సంక్రాంతి బరిలో రెండు సినిమాలో ఉండేలా కనిపించడం లేదు. వీటితో పాటు ఆయన ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇది కూడా సెట్స్ పై ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయన వెబ్ సైట్ కథనాన్ని చదివి ఉండరని తెలుస్తోంది.