ఆయన భర్తగా లభించడం నా అదృష్టం: పవిత్ర

0
4212

గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకుతున్నారన్న వార్తలు గుప్పు మన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. వారు ఇద్దరూ గత కొన్నాళ్ల నుండి సినిమాలలో కలసి నటిస్తుండం ఒక కారణంగా చెప్పవచ్చు. అంతే కాదు.. నరేష్ ఆమెకి అవకాశాలు ఇప్పిస్తున్నాడని కూడా ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అసలు ఇంతకీ వీరు ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? లేక ఇది ఒక ప్రచారం మాత్రమేనా? అనే క్లారిటీ రావాలంటే ఈ కింది వీడియో చూడండి.

పవన్‌ ‘ప్లాన్‌ బి’ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

‘అక్కడ అమ్మాయి ` ఇక్కడ అబ్బాయి’ సినిమాకు ‘భీమ్లా నాయక్‌’ సినిమాకు మధ్య నటుడిగా పవన్‌ కళ్యాణ్‌ ఎంతగా పరిణితి చెందారో.. 2009లో ‘యువరాజ్యం’ అధినేత నుంచి 2019లో ‘జనసేన’ అధినేతగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగే వరకూ రాజకీయంగా కూడా అంతే పరిణితి చెందారు అనేది సత్యం. 2019లో తనతో పాటు పార్టీ కూడా ఓటమి చెందినప్పటికీ వెనకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉంటూ తనదైన శైలిలో రాజకీయ పోరాటం చేస్తున్నారు.

బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయడం

ఈ క్రమంలోనే 2024లో జరగబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్‌ అనేక వ్యూహాలను రచించుకున్నారు. ఇందులో ప్లాన్‌ ‘ఎ’ నుంచి ప్లాన్‌ ‘జె’ వరకూ ఉన్నాయి. ఇటీవల ఆయన తన వద్ద ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మూడు ప్లాన్‌లు సిద్ధంగా ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు. ఇందులో ప్లాన్‌ 1. బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయడం. ప్లాన్‌ 2. జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో పోటీ చేయడం. 3. జనసేన ఒంటరిగా పోటీ చేయడం.

పవన్‌ ప్లాన్‌ ‘బి’ని అమలులోకి తెచ్చారు

వపన్‌ తన వద్ద నున్న ఆప్షన్స్‌ ప్రకటించిన తర్వాత అటు రాజకీయ పార్టీల నుంచి, ఇటు ప్రజలు, కేడర్‌ నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అయితే బీజేపీ, టీడీపీ నుంచి తాను అనుకున్న స్పందన రాలేదని భావించిన పవన్‌ ప్లాన్‌ ‘బి’ని అమలులోకి తెచ్చారు. అదే ‘ఒత్తిడి పెంచు` సీట్లు సాధించు’. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమి కట్టినప్పటికీ 0.8 శాతం ఓట్లు ఉన్న బీజేపీని లెక్కలోకి తీసుకోక పోయినా ఫర్వాలేదు.

పవన్‌ డిసైడ్‌ అయ్యారు

కానీ తమ కూటమిలో 40 శాతం ఓట్లతో సింహ భాగాన ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అది తమకు ఎన్ని సీట్లు ఇస్తుందనే మీమాంసలో పవన్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఎక్కువ సీట్లు ఇవ్వటానికి టీడీపీని ఒప్పించాలంటే ముందు తన సత్తా నిరూపించుకోవాలని పవన్‌ డిసైడ్‌ అయ్యారు. ఇందులో ఇందు కోసమే ముందుగా కేవలం ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్‌ చేయాలనుకున్నప్పటికీ.. ‘ఒత్తిడి’ వ్యూహంలో భాగంగా రాష్ట్రమంతటా పర్యటించాలని డిసైడ్‌ అయ్యారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం ద్వారా

దీని కోసం ప్రత్యేకంగా 8 వాహనాలతో కూడిన ప్రత్యేక కాన్వాయ్‌ని కొనుగోలు చేశారు. ఈ వాహనాలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి కూడా. విజయదశమి నాడు తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ద్వారా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అలాగే ఉంచేలా చేయడం.. అటు తెలుగుదేశంతో సీట్లపై బేరాలు ఆడే కెపాసిటీని పెంచుకోవడం పవన్‌ ప్లాన్‌ బి అని అర్ధం అవుతోంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట.