సైకిల్ పై వెళుతున్న యువకుడిని చిరుత ఏమి చేసిందో చూడండి

0
1924

సాధారణంగా అడవుల్లో సింహాలు, పులులు ఉంటాయని తెలిసిందే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే వాటిని చూసి ఉండవచ్చు. అయితే అప్పుడప్పుడు వాటి వీడియోలు కెమెరాలలో చిక్కుతాయి. అడవిలో ఉండాల్సిన ఈ జంతువులూ ఒక్కోసారి ఉర్లలోకి, సిటీలలోకి వస్తాయి. అలా బయటికి వచ్చి జనాలని బయపెడతాయి. దేనితో జనాలు ఒక్కసారిగా భయపడే పరిస్థితి వస్తుంది. గతంలో కూడా అనేక సార్లు సింహాలు, చిరుతలు బయటికి వచ్చి భయపెట్టాయి.

సైకిల్ తీసుకొని పరుగులు

ఇప్పుడు కూడా అలానే ఓ చిరుత రోడ్డుపైకి వచ్చింది. చెట్ల మాటున పొంచి ఉన్న ఓ చిరుత ఒక్కసారిగా ఓ వ్యక్తిపైకీ దూకింది. సైకిల్ పై వెళుతున్న సదరు వ్యక్తిపై రెప్పపాటులో దూకింది. దీనితో సదరు వ్యక్తి ఒక్కసారిగా బయపడి పోయాడు. అసలు ఏమి జరుగుతుందో అర్ధం అయ్యే లోపు సైకిల్ కింద పడేసాడు. ఆ తరువాత అతడికి అర్ధమై సైకిల్ తీసుకొని పరుగులు పెట్టాడు. ఈ ఘటన అక్కడి సిసిటివిలో రికార్డు అయింది.

ఐఎఫ్ఎస్ అధికారి షేర్

ఈ ఘటన అసోం లోని కజిరంగా నేషనల్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. చిరుత దాడి వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి కస్వాన్ పర్వీన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనితో ఈ వీడియో వైరల్ అయింది. పార్క్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలలో ఇది రికార్డు అయింది. అక్కడికి సమీపంలో వెళ్లే ప్రజలు జాగ్రత్తతో వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో చెప్పండి.